తెలంగాణలో 0333, 0666, 0999, 0234, 1234, 0001, 0009, 0003, 0786 నంబర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే.. ఎక్కువమంది 9 నంబర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కారణంగానే ఖైరతాబాద్ కార్యాలయానికి ఎక్కువ ఆదాయం వస్తోందని చెబుతున్నారు. చాలామంది ప్రముఖులు ఇక్కడే నంబర్లు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.