Kodali Nani fires on cinema industry సినిమా వాళ్ళు పకోడీ గాళ్ళంటున్న కొడాలి


Tue 08th Aug 2023 05:15 PM

kodali nani  సినిమా వాళ్ళు పకోడీ గాళ్ళంటున్న కొడాలి


Kodali Nani fires on cinema industry సినిమా వాళ్ళు పకోడీ గాళ్ళంటున్న కొడాలి

ఏ రాష్ట్రమైనా ఆయా సినిమా ఇండస్ట్రీలతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటుంది. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పారు.. రాజకీయ నాయకులు సినిమాల్లోనూ నటించారు. ప్రత్యక్షంగా సినిమా వాళ్ళని రాజకీయనాయకులు ఎన్నడూ ఎవరూ అవమానించింది లేదు. కానీ ఏపీ వైసీపీ నేతలు ప్రభుత్వం అండ చూసుకుని చెలరేగిపోతున్నారు. ఏపీలో బూతు మంత్రిగా పేరు తెచ్చుకుని ప్రస్తుతం పదవిలేక ఖాళీగా ఉన్న కొడాలి నాని సినీ ఇండస్ట్రీని తీవ్రంగా అవమానించాడు. 

ఇండస్ట్రీలో వాళ్ళని పకోడీ గాళ్ళంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య ఈవెంట్ లో మా రెమ్యునరేషన్ గురించి మీకెందుకు రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించండి అని అన్నందుకు కొడాలి నాని, పేర్ని నాని, బొత్స లాంటి నాయకులు సినీ ఇండస్ట్రీపై పడ్డారు. ముఖ్యంగా కొడాలి నాని సినిమా ఇండస్ట్రీ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. 

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పకోడీ గాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలోని పకోడీ గాళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఉండాలో సలహలు ఇస్తున్నారు. ప్రభుత్వం గురించి మనకు ఎందుకు అని వాళ్లకు కూడా సలహా ఇవ్వచ్చు కదా. రాజకీయాలు మనకెందుకు మనం డాన్స్ లు, ఫైట్స్, యాక్షన్ గురించి మనం చూసుకుందాం అని చెప్పచ్చు కదా. ఇద్దరికీ(పవన్) సలహాలు ఇస్తే బాగుంటుంది అంటూ కొడాలి నాని మెగాస్టార్ అలాగే సినిమా ఇండస్ట్రీపై చెలరేగిపోయాడు. 


Kodali Nani fires on cinema industry:

Kodali Nani Counter to Chiranjeevi





Source link