బంగాళాఖాతంలో వాయుగుండం, ఏపీలో మూడు రోజులు వర్షాలు-ap weather update depression affect rain in many areas latest forest report ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

మూడు రోజులు వర్ష సూచన

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతారణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమలో నేడు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

Source link