Madhya Pradesh : 40 kg of silver and bundle of notes were recovered

IT Raids : మధ్యప్రదేశ్ లో భారీగా వెండి, నోట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లోకాయుక్త జరిపిన తనిఖీల్లో సుమారు 40కిలోల వెండితో పాటు కొంత నగదును కూడా రికవరీ చేశారు. ర‌వాణా శాఖ‌లో కానిస్టేబుల్‌గా చేసిన వ్య‌క్తి ఇంట్లో లోకాయుక్త చేపట్టిన సెర్చింగ్ లో ఇవి బట్టబయలయ్యాయి. డిసెంబర్ 21న భోపాల్ లో చేసిన రైడ్ లో నోట్ల కట్టలు, 40 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నట్టు లోకాయుక్త వెల్లడించింది.

అంతకుముందు డిసెంబర్ 20న కూడా రవాణా శాఖకు చెందిన మాజీ కానిస్టేబుల్ నివాసాల నుండి లోకాయుక్త పోలీసులు రూ. 2.85 కోట్ల నగదుతో సహా రూ. 3 కోట్లకు పైగా ఆస్తులను రికవరీ చేసిన ఒక రోజు తర్వాత ఈ ఘటన జరిగింది. నగదుతోపాటు రూ.50 లక్షల విలువైన బంగారం, కొంత వెండిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్తులకు సంబంధించిన పత్రాలు సైతం వారికి దొరికాయని, వాటిని పరిశీలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

అరేరా కాలనీలోని మాజీ ఆర్టీఓ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ, అతని సన్నిహితుడు చందన్ సింగ్ గౌర్ నివాసంపై లోకాయుక్త డిసెంబర్ 20న ఉదయం దాడి చేశారు. కొన్ని గంటల తర్వాత జప్తు చేయడం గమనార్హం. శర్మ గత సంవత్సరం రవాణా శాఖ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చురుకుగా ఉన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం, నగదు సౌరభ్ శర్మ సన్నిహితుడికి సంబంధించినవిగా భావిస్తున్నారు.

 
మెండోరి జంగిల్‌లోని నిర్మాణంలో ఉన్న భవనంలో తెల్లటి రంగులో ఉన్న ఇన్నోవా క్రిస్టా—MP 07 BA 0050— డిసెంబర్ 19, 20 మధ్య రాత్రి సమయంలో గుర్తించారు. ఆదాయపు పన్ను శాఖ టార్గెట్ లిస్టులో ఉన్న చేతన్ గౌర్ పేరుతో కారు రిజిస్టర్ అయినట్లు సమాచారం. వాహనం బంపర్‌పై RTO అనే ఎర్రటి ప్లేట్‌ను కలిగి ఉందని కూడా చెప్పారు. కారులో 52 కిలోల బంగారు కడ్డీలు, నగదుతో కూడిన బ్యాగులు (రూ.100, రూ. 500 నోట్లు కలిపి రూ.10 కోట్లు) స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం ప్రకారం, బంగారం, నగదును రాష్ట్రం నుంచి తరలిస్తున్నట్లు ఐటీ శాఖ అధికారులు చెప్పారు. బంగారాన్ని స్వాధీనం చేసుకునేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో 100 మంది పోలీసులు పాల్గొన్నారు.

ఆపరేషన్‌లో భాగమైన ఒక సీనియర్ అధికారి ఫ్రీ ప్రెస్‌ మాట్లాడుతూ, “ఒక వాహనం దారిలో ఉందని, భారీ నగదు, బంగారాన్ని తీసుకువెళుతున్నట్లు మాకు గుర్తు తెలియని వ్యక్తి నుండి సమాచారం వచ్చింది. దాని ప్రకారం, మేము సంఘటన స్థలానికి చేరుకున్నాం”. మెండోరి జంగిల్‌లో వదిలి వెళ్లిన కారు నుండి దాదాపు ఆరు నుండి ఏడు బ్యాగులను బృందం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. బ్యాగుల నిండా బంగారు కడ్డీలు, నగదు ఉన్నాయి. సుమారు రూ.10 కోట్ల నగదు రికవరీ అయినట్లు అంచనా.

మరిన్ని చూడండి

Source link