ByGanesh
Sun 22nd Dec 2024 09:47 AM
హీరో శ్రీ సింహ-మురళీమోహన్ మనవరాలు రాగ ల వివాహం ఈ మధ్యనే అంటే డిసెంబర్ 14 న దుబాయ్ వేదికగా ఓ ఐలాండ్ లో జరిగిన విషయం లీకైన వీడియోస్ ద్వారా బయటికి వచ్చింది. శ్రీసింహ-రాగ ల వివాహం అత్యంత వైభవంగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ జరిగింది. అయితే శ్రీసింహ-రాగ ల పెళ్లి ప్రేమ పెళ్లా.. లేదంటే పెద్దలు కుదిర్చిన వివాహమా అనే కన్ఫ్యూజన్ చాలామందిలో నడుస్తుంది.
శ్రీసింహ-రాగ లు గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అదే విషయాన్నీ శ్రీ సింహ వివాహం తర్వాత తన పెళ్లి ఫొటోస్ ని షేర్ చేస్తూ బయటపెట్టాడు. ఇప్పటికే ఆరేళ్ళయింది.. ఎప్పటికి ఇలానే అంటూ రాసిపెట్టుంది అనే హాష్ ట్యాగ్ ని జత చేసి వెడ్డింగ్ పిక్స్ వదిలాడు. పెళ్ళికి ముందు రాగ తో హ్యాపీగా ఉన్న పిక్స్ తో పాటుగా పెళ్లి తర్వాత భార్యతో కలిసి ఉన్న పిక్స్ షేర్ చేసాడు.
చూడముచ్చటగా ఉన్న శ్రీసింహ-రాగల జంటను అందరూ ఆశీర్వదిస్తున్నారు. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ, మురళి మోహన్ కుమారుడు రామ్ మోహన్ కుమార్తె రాగ తో వివాహం జరపగా, దర్శకధీరుడు రాజమౌళి ఈ పెళ్ళిలో చేసిన డాన్స్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.
Sri Simha-Raga Love Story revealed:
Sri Simha Koduri Married To Raga Maganti