టార్గెట్ అల్లు అర్జున్, కాంగ్రెస్ నేతల విమర్శలు- సినీ పరిశ్రమకు బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు-congress leaders targeted allu arjun in sandhya theatre issue brs bjp supporting tollywood ,తెలంగాణ న్యూస్

సినీ పరిశ్రమ మళ్లీ చెన్నైకి

హీరో అల్లు అర్జున్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. విషాద ఘటన జరిగిన రోజే ప్రెస్‌మీట్‌ పెట్టి ఆ కుటుంబానికి అండగా ఉంటే బాగుండేదన్నారు. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆ ఘటనలో ఓ మహిళ మృతిచెందడం, బాలుడు తీవ్రంగా గాయపడడం బాధాకరమన్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం, సినీ పరిశ్రమ మద్దతుగా ఉండాలని డిమాండ్‌ చేశారు. అల్లు అర్జున్‌ పై కేసుపెట్టి ఇబ్బంది పెడుతున్నారన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి అత్యంత ఘోరంగా మాట్లాడారని ఎర్రబెల్లి దయాకర్‌ అన్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ ప్రముఖులు మళ్లీ చెన్నైకి వెళ్లాలని చర్చించుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Source link