car flips 8 times on rajasthan highway and passengers safe video gone viral | Car Accident: అదృష్టం అంటే వీళ్లదే!

Rajasthan Car Accident: అదృష్టం కలిసొస్తే పామే తాడై మేలు చేస్తుందంటారు. అదే అదృష్టం లేకుంటే అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్ది ఇదీ ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్. రాజస్థాన్‌లోని (Rajasthan) బీకానేర్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన కారు ప్రమాదం చూస్తే.. నిజంగా అదృష్టం అంటే వీరిదేనేమో అనిపిస్తుంది. హైవేపై కారు అదుపు తప్పి 8 పల్టీలు కొట్టినా అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంతే కాకుండా వారు కూల్‌గా కారు దిగి టీ అడిగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా బీకానేర్ (Bikaneer) సమీపంలో హైవేపై ఓ ఎస్‌యూవీ కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న సమయంలో డ్రైవర్ యూటర్న్ తీసుకుంటుండగా కారు 8 పల్టీలు కొట్టి ఓ కార్ల షోరూం గేటుపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు. వీరు నాగౌర్ నుంచి బీకానేర్‌కు వెళ్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ప్రకారం.. అతి భయానకంగా జరిగిన ఈ కారు ప్రమాదంలో కారులోని ఐదుగురూ చిన్న గాయం కూడా కాకుండా క్షేమంగా బయటపడ్డారు. కారు పల్టీలు కొడుతున్న సమయంలోనే డ్రైవర్‌తో సహా ఒకరిద్దరు అందులోంచి బయటకు దూకేశారు.

కూల్‌గా ‘టీ’ అడిగారు

అయితే, ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కారులోంచి బయటపడ్డ వారు షోరూం వద్దకు వెళ్లి కూల్‌గా టీ అడిగారు. ‘ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. లోపలికి వెళ్లగానే టీ కావాలని అడిగారు.’ అని షోరూం సిబ్బంది తెలిపారు. 

Also Read: Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి

మరిన్ని చూడండి

Source link