JEE Advanced 2025 Notification: దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష జేఈఈ అడ్వాన్స్డ్-2025 నోటిఫికేషన్ శనివారం (డిసెంబరు 21) విడుదలైంది. ఈ ఏడాది ఐఐటీ కాన్పూర్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను చేపట్టింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ (IIT), నిట్(NIT)లలో ప్రవేశాలు కల్పిస్తారు. బీటెక్, బీఎస్, బీఆర్క్, డ్యూయల్ డిగ్రీ (బీటెక్ + ఎంటెక్), డ్యూయల్ డిగ్రీ (బీఎస్ + ఎంఎస్), ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్, డ్యూయల్ డిగ్రీ బీటెక్ + ఎంబీఏ, డ్యూయల్ డిగ్రీ బీఎస్ + ఎంబీఏ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.
జేఈఈ మెయిన్ 2025లో అర్హత సాధించిన 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. ఇందులో ఓపెన్ కేటగిరీ 1,01,250 మంది; ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 25,000 మంది; ఓబీసీ కేటగిరీ 67,500 మంది; ఎస్సీ కేటగిరీ 37,500 మంది; ఎస్టీ కేటగిరీ 18,750 మంది విద్యార్థులను ఎంపికచేస్తారు. విద్యార్థలు వరుసగా రెండుసార్లు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసే వెసులుబాటు ఉంది.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు మే 5 వరకు అవకాశం కల్పించింది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను మే 11 నుంచి 18 మధ్య డౌన్లోడ్ చేసుకోవచ్చు.
జేఈఈ మెయిన్‌లో కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం 17,695 బీటెక్ సీట్లు, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్) సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వచ్చే విద్యాసంవత్సరం (2025-26)లో మరికొన్ని సీట్లు పెరిగే అవకాశముంది.
వివరాలు..
* జేఈఈ అడ్వాన్స్డ్ – 2025
అర్హత: మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్ ఉండాలి. కనీసం 75 శాతం మార్కులు వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 65 శాతం మార్కులు ఉండాలి. జేఈఈ మెయిన్-2025 పేపర్-1 రాసినవారే అడ్వాన్స్‌డ్‌కు అర్హులు. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్వాన్స్‌డ్‌కు ఎంపికచేస్తారు.
వయోపరిమితి: 2000 అక్టోబరు 1 తర్వాత జన్మించినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు ఉంటుంది. అంటే 1995 అక్టోబరు 1 తర్వాత జన్మించినవారై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ఆధారంగా.
ఫీజు వివరాలు…
* దేశీయ విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.3200 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1600 చెల్లిస్తే సరిపోతుంది. విదేశీ విద్యార్థులు సార్క్ దేశాలకు చెందినవారైతే 100 యూఎస్ డాలర్లు, నాన్-సార్క్ దేశాలకు చెందినవారైతే 200 యూఎస్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
* విదేశాల్లో పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు కింద 150 యూఎస్ డాలర్లు చెల్లించాలి. విద్యార్థులు సార్క్ దేశాలకు చెందినవారైతే 150 యూఎస్ డాలర్లు, నాన్-సార్క్ దేశాలకు చెందినవారైతే 250 యూఎస్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఒక్కోక్కటి మూడు గంటల వ్యవధి ఉంటుంది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు; పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు పేపర్లూ రాయడం తప్పనిసరి. రెండు పేపర్లలోనూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు…
➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.04.2025.
➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.05.2025.
➥ ఫీజు చెల్లించడానికి చివరితేది: 05.05.2025.
➥ అడ్మిట్‌కార్డులు డౌన్లోడ్: 11.05.2025 నుంచి 18.05.2025 వరకు
➥ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షతేది: 18.05.2025.
➥ విద్యార్థుల రెస్పాన్స్ షీట్లు: 22.05.2025.
➥ ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ విడుదల: 26.05.2025.
➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 26.05.2025 – 27.05.2025.
➥ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల వెల్లడి: 02.06..2025.
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) దరఖాస్తు ప్రారంభం: 02.06..2025.
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) దరఖాస్తుకు చివరితేదీ: 03.06..2025.
➥ జాయింట్ సీట్ అలోకేషన్ (JoSAA) కౌన్సెలింగ్ ప్రారంభం: 03.06..2025.
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) పరీక్ష తేదీ: 05.06..2025.
➥ ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) ఫలితాల వెల్లడి: 08.06..2025.
JEE Advanced -2025 Notification
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి…