₹2 Crore-worth Of Pension To ‘dead’ Recipients: CAG Flags Lapse In Govt Scheme | Government Scheme: చనిపోయిన వారికి పింఛన్లు- టాప్‌లో పశ్చిమ బెంగాల్‌

Government Scheme: జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP) అమలులో కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (CAG) అనేక అవకతవకలను గుర్తించింది. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద పేదరికంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సామాజిక పెన్షన్‌లను కేంద్రం అందిస్తోంది.  కాగ్ నివేదిక ప్రకారం, 26 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు దాదాపు 2,103 మంది లబ్ధిదారులకు వారి మరణానంతరం కూడా ₹2 కోట్ల విలువ చేసే పెన్షన్లు చెల్లించాయి.  2017 నుంచి 2021 మధ్య చెల్లింపులపై కాగ్ ఈ అధ్యయనం నిర్వహించింది.

NSAP మార్గదర్శకాల ప్రకారం, లబ్ధిదారుడు మరణించినా, వలస వెళ్లినా, దారిద్ర రేఖకు ఎగువన ఉన్నా పెన్షన్ చెల్లింపు ఆగిపోతుంది. అయితే, వివిధ రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు మరణాలను సకాలంలో నివేదించడంలో విఫలమయ్యాయని, ఫలితంగా చనిపోయిన, ఉనికిలో లేని వ్యక్తులకు పింఛన్లు చెల్లించడానికి దారితీసిందని నివేదిక  తెలిపింది. అర్హుల గుర్తింపు, సరైన సమాచారం లేకపోవడం, అనర్హుల గుర్తించేందుకు సరైన వ్యవస్థ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

చనిపోయిన, అనర్హులకు పింఛన్లు పంపిణీలో పశ్చిమ బెంగాల్ తొలి స్థానంలో ఉంది. మరణించిన వారికి పెంఛన్లు అందించిన జాబితాలో 26 రాష్ట్రాల్లోనే వెస్ట్ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో గుజరాత్, త్రిపుర ఉన్నాయి. బెంగాల్‌లో 453 ఖాతాల్లో రూ.83.27 లక్షలు జమ చేశారు. గుజరాత్‌లో 413 ఖాతాల్లో రూ11.83 లక్షలు, త్రిపురలో  250 ఖాతాల్లో రూ.1.83 లక్షలు జమచేశాయి.  మణిపూర్, మిజోరాం,  పుదుచ్చేరిలు చనిపోయిన లబ్ధిదారులకు అతి తక్కువ మొత్తంలో అదనపు పెన్షన్లు చెల్లించాయి. 

అర్హులైన లబ్ధిదారుల డేటాబేస్ నిర్వహణ లేకపోవడం, ప్రత్యేక ధృవీకరణ బృందాలు ఏర్పాటు చేయకపోవడం, వార్షిక ధృవీకరణ నిర్వహించకపోవడం, అనర్హులను తొలగించేందుకు గ్రౌండ్‌ లెవెల్‌లో సరైన తనిఖీలు లేకపోవడం, చురుకైన గుర్తింపు కోసం నిర్దేశిత ప్రక్రియ లేకపోవడం, లబ్ధిదారులు IEC కార్యకలాపాలు లేకపోవడంతో పాటు ఇతర కారణాలతో ఈ చెల్లింపులకు కారణమని కాగ్ తెలిపింది. పలు రాష్ట్రాలు చాలా వరకు పెద్ద మొత్తంలోనే పెంఛన్లు పంపిణీ చేస్తున్నాయి.

NSAP మార్గదర్శకాలకు విరుద్ధంగా దాదాపు 13 రాష్ట్రాలు 2.4 లక్షల మంది లబ్ధిదారులకు తక్కువ మొత్తంలో పెన్షన్‌లను చెల్లించాయని కాగ్ పేర్కొంది. ఫలితంగా ₹42.85 కోట్ల స్వల్ప చెల్లింపులు జరిగాయని అధ్యయనంలో తేలింది. నాలుగు రాష్ట్రాలు త్రిపుర, మణిపూర్, మిజోరాం, జమ్మూ కాశ్మీర్ గుర్తించబడిన పరిమితికి మించి లబ్ధిదారులకు పెన్షన్‌ను చెల్లించాయి. 

NSAP మార్గదర్శకాల మేరకు 80 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న లబ్ధిదారులకు, అనేక ఉపపథకాల క్రింద – IGNOAPS, IGNWPS, IGNDPS నెలవారీ రూ.200 రూ.300 చెల్లించాలని పేర్కొన్నాయి. దాదాపు 80 ఏళ్ల వయస్సు ఉన్న లబ్ధిదారులకు నెలకు ₹500 అందించాలి. విద్య, కమ్యూనికేషన్ (IEC) కార్యకలాపాల కోసం కేటాయించిన సుమారు ₹2.83 కోట్ల విలువైన నిధి ఇతర పథకాల ప్రచారం కోసం మళ్లించారు. అలాగే ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్ల్లో ₹57.45 కోట్ల నిధులు ఇతర పథకాల కోసం మళ్లించబడ్డాయి. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Source link