Uber driver hit a female passenger for turning on the AC in the car | Uber Driver: ఏసీ వేయమంటే మహిళా ప్యాసింజర్‌ను కొట్టిన క్యాబ్ డ్రైవర్

Uber driver hit a female passenger for turning on the AC in the car: ఈ రోజుల్లో ఏదైనా అవసరం వస్తే ముందుగా క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం. అర్థరాత్రి అయినా అపరాత్రి అయినా సెక్యూరిటీ ఉంటుందని చాలా మంది సొంతకార్లు ఉన్నా కూడా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మనుషులందరూ ఒక్కలా ఉండరు. అలాగే క్యాబ్ డ్రైవర్లు కూడా.  కొంత మంది ఘోరమైన వ్యక్తులు ఉంటారు. ప్యాసింజర్లపై దాడి చేస్తారు కూడా. అలాంటి ఓ ఉబెర్ డ్రైవర్ ఉదంతమే ఇది.            

అస్సాంలోని గువాహటి ప్రాంతంలో మైనీ మహంత అనే మహిళ క్యాబ్ బుక్ చేసుకుంది. రాత్రి పూట కావడంతో మరింత సేఫ్ గా ఉంటుందని ప్రిమీయర్ క్యాబ్ బుక్ చేసుకుంది. కారు ఎక్కిన కాసేపటికి ఉక్కపోస్తూండటంతో ఏసీ ఆన్ చేయమని డ్రైవర్ ను అడిగింది. అయితే మీరు ఏసీ కార్ బుక్ చేసుకోలేదని ఆ డ్రైవర్ చెప్పారు. ఆ మహిళ తన భర్తకు ఫోన్ చేసి నాన్ ఏసీ కార్ బుక్ చేశావా అని అడిగింది. అయితే కార్ బుకింగ్‌లలో ఏసీ, నాన్ ఏసీ ఉండవని చెప్పడంతో ఆ మహిళ ఆ డ్రైవర్ ను తిరిగి ప్రశ్నించారు. దాంతో కోపం తెచ్చుకున్న డ్రైవర్ రోడ్డును కారుపై ఆపి ఆమెపై దాడి చేశాడు.                            

తన కు ఎదురైన అనుభవంతో ఆమె భయపడిపోయారు. ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. తర్వాత ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయిపోయింది.  

ఈ క్యాబ్ డ్రైవర్ మహిళపై దాడి చేశారని తెలియడంతో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా స్పందించారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తాని.. తక్షణం క్యాబ్ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఉబెర్ డ్రైవర్లుగా ఎన్ రోల్ చేసుకునేందుకు చాలా పరిశీలనలు చేయాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.    

Also Read: Gudivada Amarnath: సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను

 

మరిన్ని చూడండి

Source link