The TDP cadre has taken on a new tune కొత్త రాగం అందుకున్న తెలుగు తమ్ముళ్లు

నిన్నగాక మొన్న మహాసేన రాజేష్ నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం ని చెయ్యాలంటూ డిమాండ్ చెయ్యడం ఎంతగా హాట్ టాపిక్ అయ్యిందో.. ఇప్పుడు అదే టీడీపీ కార్యకర్తల నుంచి, అభిమానుల నుంచి లోకేష్ ని డిప్యూటీ సీఎం ని చెయ్యాలంటూ నినాదాలు మొదలయ్యాయి. సీఎం గా  చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తమ పని పద్దతిగా, పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. 

విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తన పని చెయ్యడమే కాదు, మంగళగిరి నియోజకవర్గంలోను, అలాగే టీడీపీ కేడర్ లోను తన మార్క్ చూపించేందుకు శతవిధాలుగా కష్టపడుతున్నాడు. తండ్రి సీఎం గా ఏపీ ని చూసుకుంటున్నారు, లోకేష్ పార్టీని ముందుండి నడిపిస్తున్నాడు. అటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా తన పని తాను చేసుకోవడమేకాదు.. కూటమి ప్రభుత్వంలో బలాన్ని పెంచుకుంటున్నారు. 

పవన్ ప్రాముఖ్యత పెరగడం పట్ల టీడీపీ కార్యకర్తలు, టీడీపీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మరోపక్క పవన్ ప్రతిసారి హోమ్ శాఖ ఇవ్వమంటున్నారు. అదేదో లోకేష్ కి డిప్యూటీ హోదా ఇచ్చేసి, పవన్ కళ్యాణ్ కి హోమ్ తో పాటు ఇతర శాఖల బాధ్యతలు అప్పజెప్పమని టీడీపీ కార్యకర్తలు కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. 

మరోపక్క చంద్రబాబు ఏపీని పవన్ కళ్యాణ్ కి అప్పగించి జాతీయస్థాయి రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారనే వార్త కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

Source link