Monalisa went back to her hometown after taking out a loan After Viral in Maha Kumbh Mela 2025 | Monalisa In Mahakumbh: అప్పు చేసి మరీ సొంతూరికి వెళ్లి మోనాలిసా

Monalisa In Mahakumbh: చక్కని కళ్లు, అందమైన చిరునవ్వుతో ఇటీవల మహా కుంభమేళా 2025లో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ లో ఫేమ్ అయిన మోనాలిసా.. ఈ మధ్యే తాను తన సొంతూరుకు వెళ్తున్నానంటూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె మధ్యప్రదేశ్ లో ఉన్న తన ఇంటికి అంటే మహేశ్వర్ కు చేరుకుంది. కుంభమేళా ఫేమస్ కావడంతో అందరూ ఆమెను చూడడానికి ఎంతలా ఎగబడ్డారో అందరూ చూసే ఉంటారు. కొన్ని సార్లు ఆమె బయటకి రావాలంటే కూడా ముసుగుతో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫొటోలు, వీడియోలు అంటూ చాలా మంది ఆమె చుట్టూ చేరి, తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఊపిరి ఆడకుండా చేశారు. ఆమె పూసల దండలు అమ్ముకోనివ్వకుండా నానా హంగామా సృష్టించారు.
దీని వల్ల వ్యాపారం కోసం మహా కుంభమేళాకు వెళ్లిన ఆమె కుటుంబం కేవలం 15 రోజుల్లోనే ఇంటికి తిరిగి రావల్సి వచ్చింది. అంతే కాదు ఆమె సొంతూరుకు వెళ్లేందుకు సైతం రూ.35 వేలు అప్పుగా తీసుకునే దీనస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమె 10 రోజుల్లోనే రూ.10 కోట్లు సంపాదించిందని, ఓ డైరెక్టర్ సైతం ఆమెకు సినిమాల్లో నటించేందుకు ఆఫర్ ఇచ్చారని, ఇంకా నానా రకాలుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలన్నింటికీ మోనాలిసా సమాధానం చెప్పింది. అన్ని విషయాలపైనా ఓ క్లారిటీ అయితే ఇచ్చేసింది.

మోనాలిసా నిజంగానే సినిమాల్లో నటించనుందా..

మహా కుంభమేళాలో అందరూ అలా తన చుట్టూ చేరడం వల్ల తన వ్యాపారానికి తీవ్ర ఇబ్బంది కలిగిందని మోనాలిసా చెప్పింది. దండలు అమ్ముకోనివ్వకుండా చేశారని వాపోయింది. దానికి తోడు రూ.35 వేలు అప్పు చేసి మరీ ఇంటికి తిరిగొచ్చామని చెప్పింది. అక్కడ కొన్ని బాధగా అనిపించినా, అందరూ తనను ఎంతో ప్రేమతో ఆదరించారంది. ఇక సినిమాల్లో నటించే విషయంపైన స్పందించిన మోనాలిసా.. తనకు ఎవరూ నేరుగా ఫోన్ కాల్ చేయలేదని తెలిపింది. ఆ ఆఫర్ల గురించి కేవలం తన తండ్రికే చెప్పారని, మిమ్మల్ని త్వరలోనే కలుస్తాం అని ఫోన్ చేసి వ్యక్తి.. మళ్లీ తమను సంప్రదించలేదని చెప్పింది. తమను కలవడానికి ఎవరూ రాలేదని స్పష్టం చేసింది. మరి ఒక వేళ నిజంగానే సినిమాల్లో నటించాలని ఎవరైనా ఆఫర్ చేస్తే నటిస్తారా అన్న ప్రశ్నకు మోనాలిసా బదులిస్తూ.. అమ్మ, నాన్న ఏం చెబితే అది చేస్తానని చెప్పింది. పెద్దలందరూ పర్మిషన్ ఇస్తే, అందరూ ఓకే అనుకుంటే మోనాలిసా సినిమాల్లో నటించవచ్చని మోనాలిసా తండ్రి కూడా చెప్పాడు.

రాత్రికి రాత్రే సంచలనంగా మారిన మోనాలిసా

మహా కుంభమేళా ప్రారంభమైన కొద్ది రోజులకే మోనాలిసా చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె లేత గోధుమరంగు కళ్ళు ఆమెను రాత్రికి రాత్రే ఫేమ్ ను తెచ్చి పెట్టాయి. ఇంటర్నెట్ లో ఓవర్ నైట్ స్టార్ అయిన తరువాత.. దండలు అమ్ముకోవడానికి వెళ్లిన మోనాలిసా, ఆమె కుటుంబం తమ వ్యాపారం చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అందరూ అలా ఆమెను ఫొటోలు, వీడియోలంటూ వచ్చే వారి నుంచి తప్పించుకునేందుకు, ఆమెను రక్షించేందుకు ఇటీవల ఆమె మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు తిరిగి వెళ్తున్నట్టు స్పష్టం చేసింది.

Also Read : Mahakumbh Mela Stampede 2025: మహా కుంభమేళాలో ఘోర విషాదం – 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు

మరిన్ని చూడండి

Source link