ByGanesh
Thu 30th Jan 2025 11:12 AM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలనే కోరిక ఏ దర్శకుడికైనా ఉంటుంది. తండేల్ తో మరో వారం రోజుల్లో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు రాబోతున్న చందు మొండేటి కూడా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలనే కోరిక ఉంది. ఉండడమే కాదు.. ఎన్టీఆర్ గారితో కూర్చున్నాను. ఒక కథ కూడా చెప్పాను… అదిరిపోయింది చందు డెవలప్ చేద్దాం అన్నారు.
అది ముందుకు వెళ్ళే ప్రాసెస్ లో ఉంది.. అంటూ తండేల్ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాపై చందు మొండేటి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కార్తికేయ 2 తో పాన్ ఇండియా డైరెక్టర్ హోదాను పొందిన చందు మొండేటి – ఎన్టీఆర్ తో సినిమా అంటే దానికెంత క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు.
అయితే ఎన్టీఆర్ కమిట్మెంట్స్ పూర్తయ్యేవరకు చందు మొండేటికి రెండు చిత్రాలు తెరకెక్కించే సమయం ఉంటుంది. ముందుగా ఎన్టీఆర్ వార్ 2 కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. తర్వాత ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళాలి. ఆ తర్వాత దేవర 2 కంప్లీట్ చెయ్యాల్సి ఉంటుంది వీటి తర్వాత ఎన్టీఆర్ నెల్సన్ తోనా, లేదంటే చందు మొండేటితోనా అనేది తెలుస్తుంది.
Chandoo Mondeti movies with NTR comments:
Chandoo Mondeti Goosebumps Words About NTR