Anil Ravipudi Increases His Fee After Blockbuster Success of Sankranti Ki Vostunnam పారితోషికం పెంచేసిన అనిల్ రావిపూడి


Thu 30th Jan 2025 05:25 PM

anil ravipudi  పారితోషికం పెంచేసిన అనిల్ రావిపూడి


Anil Ravipudi Increases His Fee After Blockbuster Success of Sankranti Ki Vostunnam పారితోషికం పెంచేసిన అనిల్ రావిపూడి

దర్శకుడు అనిల్ రావిపూడి పారితోషకం పెంచేసాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వరస సినిమాల హిట్స్ తో అనిల్ రావిపూడి పారితోషికం పెరగలేదు. 300 కోట్ల మార్క్ చేరుకున్న ఆయన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తర్వాత ఆయన రేంజ్ పెరిగింది. దానితోనే పారితోషికం హైక్ అంటూ మాట్లాడుకుంటున్నారు. 

సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి విడుదలై ఫుల్ క్యాష్ చేసుకోవడమే కాదు నిర్మాత దిల్ రాజుకి లాభాల వర్షం కురిపించింది. వరస ప్రమోషన్స్ తో సినిమా పై క్యూరియాసిటీ కలిగించడం, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవడంతో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దానితో అనిల్ రావిపూడి రేంజ్ పెరిగింది. 

ప్రస్తుతం మెగాస్టార్ తో మూవీకి కమిట్ అయిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి పారితోషికం పరంగా భారిగా డిమాండ్ చేస్తున్నాడని ఒకరు కాదు.. అనిల్ రావిపూడి రేంజ్ చూసి వారే పెంచి ఇస్తున్నారు అని కొందరు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా అనిల్ రావిపూడి పారితోషికం అయితే పెరిగింది అని ఒప్పుకోవాల్సిందే.


Anil Ravipudi Increases His Fee After Blockbuster Success of Sankranti Ki Vostunnam:

Anil Ravipudi Rising Paycheck: A Look at His Growing Demand Post Success





Source link