Chaina company gave a bonus as much money as they count in 15 minutes | Viral News: పావు గంట టైమ్ ఇస్తారు – ఎంత లెక్కపెడితే అంత బోనస్

Chaina company gave a bonus as much money as they count in 15 minutes:  ఆ కంపెనీలో బాసులు నీకు ఎంత బోనస్ కావాలని అడగరు..  ఇంత పర్సటేజీ అని లెక్క కట్టి ఇవ్వరు. నీకు ఎంత బోనస్ కావాలో నువ్వే తీసుకో అని నీ ముందు డెబ్బై కోట్ల రూపాయలు పెడతారు. అందులో నుంచి తీసుకోవచ్చు. కానీ షరతులు వర్తిస్తాయి. ఆ షరతులు ఏమిటంటే.. పదిహేను నిమిషాల సమయం ఇస్తారు. ఆ సమయంలోనే ఎంత డబ్బులు లెక్కపెట్టగలిగితే అంత తీసుకుని పోవచ్చు. ఇదేదో కొత్తగా ఉంది కదా.. ఇలా చేస్తే ఆ ఉద్యోగి తీసుకున్నంత బోనస్ ఇచ్చినట్లు అవుతుంది.                 

ఈ తరహా బోనస్ గేమ్ పెట్టింది ఇండియన్ కంపెనీ కాదు.  చైనా కంపెనీ.  చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ సంస్థ.. తమ కంపెనీ ఉద్యోగులకు వార్షిక బోనస్ గా రూ.70 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అన్న  భావన రాకుండా ఉండేందుకు ఎవరి బోనసులు వాళ్లే తీసుకునేలా ఏర్పాట్లు చేసింది. 60 నుంచి 70 మీటర్ల టేబుల్ పై ఈ మొత్తాన్ని ఉంచి ఉద్యోగులను 30 టీమ్స్ గా డివైడ్ చేసింది. ఒక్కో టీమ్ నుంచి ఇద్దరు మాత్రమే వచ్చి 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడతారో అంత ఆ టీమ్ తీసుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది. ఉద్యోగులు తమ తమ నైపుణ్యాలను ప్రదర్సించారు.                

2023 జనవరిలోనూ ఇదే విధంగా హెనన్ మైన్ క్రేన్ సంస్థ తమ ఉద్యోగులకు రూ.70 కోట్ల బోనస్ ఇచ్చింది. తమ కంపెనీ ఇలాంటి గేములు పెడుతుందని వారికి తెలుసు కాబట్టి చాలా మంది రెండు, మూడు నెలల ముంద నుంచే ప్రాక్టీస్ చేసి వచ్చి  వీలైనంత ఎక్కువగా బోనస్ పొందే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

చైనాలో కంపెనీలు తమ ఉద్యోగులతో చాలా ఎక్కువగా పనులు చేయించుకుంటాయి. అయితే వారికి మంచి జీతాలు ఇవ్వడానికి ఇటీవలి కాలంలో ముందుకు వస్తున్నాయి. స్కిల్డ్ లేబర్ తగ్గిపోతూండటంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి                  

Also Read : Airplane Crash : గాలిలో హెలికాప్టర్‌ను ఢీకొట్టి, నదిలో కుప్పకూలిన విమానం – నిలిచిపోయిన విమాన రాకపోకలు

 

మరిన్ని చూడండి

Source link