వెనుకబడి కులాలు (బీసీ), ఆర్థికంగా వెనుకబడిన వర్గం (ఈడబ్ల్యూఎస్) వర్గాలకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. బీసీ, ఈబీసీ, కమ్మ, కాపు, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, బలిజ, తెలగ, ఒంటరి వర్గాలకు సంబంధించిన లబ్ధిదారులకు.. సబ్సిడీ రుణాలు మంజూరు చేయనుంది. బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ రుణాలను ఇవ్వనుంది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.