ByGanesh
Thu 30th Jan 2025 05:16 PM
ఇప్పటివరకు టాలీవుడ్ లో బిగ్ బాస్ టైటిల్ గెలిచిన విన్నర్స్ ఏం చేస్తున్నారో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ కూడా అదే చేస్తున్నాడు. గతంలో టైటిల్ గెలిచిన శివ బాలాజీ దగ్గర నుంచి గత ఏడాది పల్లవి ప్రశాంత్ వరకు విన్నర్స్ అయ్యాక ఏం చేసారో ఈ సీజన్ విన్నర్ నిఖిల్ కూడా అలానే ఉన్నాడు. బిగ్ బాస్ లోకి వెళితే హీరోలైపోతాము, బిజీ అవుతామని కలలు కనీ అవి నెరవేరక గప్ చుప్ గా ఉంటున్నారు.
శివబాలాజీ విన్నర్ అయ్యాక నటుడిగా బిజీ అవుతాడనుకుంటే అతని కేరీర్లో ఎలాంటి మార్పు లేదు, రెండో విన్నర్ కౌశల్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు, ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటున్నాడు. ఇక గత సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అంటూ తెగ బిల్డప్ ఇచ్చాడు. విన్నర్ అయ్యాక ఏం చేసాడు. ఏమి లేదు.
సీజన్ 8 విన్నర్ అయ్యాక నిఖిల్ కి కూడా స్టార్ మాలో ఏదో ఒక సీరియల్ ఆఫర్ అయితే ఇస్తుంది. ఈలోపు ఫెస్టివల్ ప్రోగ్రామ్స్, సండే ప్రోగ్రామ్స్ కి పిలిచి అతని క్రేజ్ వాడుకుంటుంది. అంతేకాని నిఖిల్ కూడా గత సీజన్స్ విన్నర్స్ వలే కామ్ గా ఉన్నాడే తప్ప ఎలాంటి అద్భుతాలు సాధించే ఛాన్స్ లేదు. రాదు అంతే.. బిగ్ బాస్ విన్నర్స్ అయినా, కంటెస్టెంట్స్ అయినా.. సేమ్ టు సేమ్ అన్నమాట.
What Are the Bigg Boss Winners Doing Now? A Look at Their Careers PostShow:
From Bigg Boss Winner to Silent Stardom: Why the Fame Fades Quickly