ByGanesh
Fri 31st Jan 2025 06:21 PM
నాచురల్ స్టార్ నాని గతంలో వరుసగా హిట్ సినిమాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనకు ఓ కొత్త కాంట్రవర్సీ ఎదురైంది. తన గత మూడు సినిమాలు హిట్టయినప్పటికీ వాటిలో ఒకటి ఒరిజినల్ సినిమాగా కాకుండా రీమేక్ కావడంపై ఒక నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ మూడు సినిమాల్లో రెండు మాస్ సినిమాలు అయిన సరిపోదా శనివారం, దసరా ఉన్నాయి. అలాగే క్లాస్ సినిమా హాయ్ నాన్న కూడా ఉంది. ఇప్పుడు హాయ్ నాన్న సినిమా విషయానికి వస్తే.. ఇది కన్నడ సినిమా అయిన భీమసేన నలమహారాజ నుంచి కాపీ కొట్టారని ఆ నిర్మాత ఆరోపిస్తున్నారు.
ఈ కన్నడ భీమసేన నలమహారాజ సినిమాను దర్శకుడు కార్తిక్ సరగర్ డైరెక్ట్ చేసి పుష్కర మల్లికార్జునయ్య నిర్మించారు. భీమసేన నలమహారాజ సినిమా నిర్మాణ బృందం.. తన సినిమా హక్కులు తీసుకోకుండా నాని సినిమా చేస్తే అది అనధికారిక రీమేక్ అని అన్నారు. అలాగే నాని ఇంత ఛీప్ పని చేస్తాడా అని కూడా కఠిన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు ఈ కాంట్రవర్సీపై నాని అభిమానులు నిర్మాతలపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద నాని లేదా ఆయన టిమ్ ఇంకా స్పందించలేదు. మరి దీనిపై ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.
Kannada producer accuses Nani :
Kannada producer accuses Nani Hi Nanna of plagiarism