Budget 2025 : 2025 -26 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే పలు రంగాలకు కేటాయింపులను నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024-25లో రక్షణ మంత్రిత్వ శాఖ (MoD)కు రూ. 6,21,940.85 కోట్లు కేటాయించారు. ఇది మంత్రిత్వ శాఖలలోనే అత్యధికం. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేటాయింపుల కంటే దాదాపు రూ. 1 లక్ష కోట్లు (18.43 శాతం) ఎక్కువ, 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే 4.79 శాతం ఎక్కువ. ఈ సారి బడ్జెట్ లో ఏసింగ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ iDEX (ADITI) పథకం ద్వారా ఇన్నోవేషన్‌కు రూ. 400 కోట్లు కేటాయించారు. 2025-26 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమయం సమీపిస్తున్నందున, ఇతర విషయాలతోపాటు పరిశోధన & అభివృద్ధి, సంస్కరణలపై దృష్టి కేంద్రీకరించనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై ముందుకు
జియోపాలిటికల్ డైనమిక్స్‌ను భారతదేశం విజయవంతంగా మార్గనిర్దేశం చేస్తోందని కార్బోరండమ్ యూనివర్సల్ లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ సుబ్బు వెంకటాచలం కొనియాడారు. 2025 డిఫెన్స్‌లో ‘సంస్కరణల సంవత్సరం’గా మన ఆత్మనిర్భర్త ఆశయానికి మరింత దగ్గరవుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా మూలధన వ్యయంపై గణనీయంగా కేటాయింపులు ఉండడడం వినూత్న సాంకేతికతలను రంగంలోకి తీసుకువచ్చేందుకు, సైనిక ఆధునికీకరణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు వీలు కల్పిస్తుందని వెంకటాచలం చెప్పారు. దేశీయ ఉత్పత్తికి ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. సైనిక వైఖరిని మరింత బలపర్చేందుకు దేశీయ ఉత్పత్తి సామర్థ్యం, ఆవిష్కరణ సామర్థ్యాలను విస్తరించడం చాలా కీలకమని, ఈ కేటాయింపులు విశ్వసనీయత, బాధ్యతను ప్రోత్సహిస్తుందన్నారు. “ప్రస్తుత కేటాయింపులు డిఫెన్స్‌పై స్టాండింగ్ కమిటీ 3 శాతం కంటే తక్కువగా ఉన్నందున, కీలకమైన ప్రాధాన్యతల కోసం ఖర్చును పెంచడానికి మాకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయి” అని చెప్పారు.
ఇది పరిశోధనతో పాటు డెవలప్‌మెంట్ లైఫ్‌సైకిల్‌ను వేగవంతం చేయడానికి, ఖర్చులను తగ్గించడానికి, కొత్త వ్యూహాలను, ఆవిష్కరణలను ప్రోత్సాహాన్ని ఇస్తుందని వెంకటాచలం అభిప్రాయపడ్డారు. అగ్రశ్రేణి సంస్థలలో పరిశోధనా విభాగాలను అభివృద్ధి చేయడానికి, అనేక రకాల ఆన్-గ్రౌండ్ సవాళ్లను పరిష్కరించడానికి ఇది సహాయపడుతుందని చెప్పారు. సైనికులతో పాటు వారి వాహనాలకు భద్రత, రక్షణ అత్యున్నత ప్రమాణాలను నిర్ధారిస్తుందన్నారు. ఇక డీఆర్డీవో ఛైర్మన్ ఇటీవల సూచించిన విధంగా ఆర్ అండ్ డీపై బడ్జెట్ వ్యయాలను ప్రస్తుత 5 శాతం నుండి 15 శాతానికి పెంచడం, రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా అభివృద్ధి చేయడంలో సహాయపడుతుందని చెప్పారు. ఇది భారతదేశానికి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని, ముఖ్యంగా నెక్ట్స్ జనరేషన్ ఏరో ఇంజన్ సామర్థ్యాలను మరింత పెంచుతుందన్నారు.
మౌలిక సదుపాయాల ఖర్చును పెంచడం
ఇక రక్షణ రంగానికి కేటాయింపులపై ఇంద్రజల్ సీఈవో & సహ వ్యవస్థాపకుడు కిరణ్ రాజు మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల ఖర్చులను పెంచడంపై కేంద్రం దృష్టి పెడుతుందని చెప్పారు. ప్రభుత్వం మన సాయుధ బలగాలను ఆధునీకరించడం, సరిహద్దు, తీర ప్రాంత భద్రతను పటిష్టం చేయడం, భారతదేశాన్ని ముందుకు నడిపించడానికి భవిష్యత్ ను ఆశించి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తోందని, ఇది పురోగతి దశను సూచిస్తుందన్నారు. ఈ కేటాయింపులు కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయన్నారు. చాలా రాష్ట్రాలు ఇప్పటికే డ్రోన్ వినియోగంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినప్పటికీ, అధిక మొత్తంలో డ్రోన్‌లకు మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాలు ఇప్పటికీ లేవన్నారు. డ్రోన్ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు, స్వదేశీ డ్రోన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశాన్ని మరింత స్వావలంబన, సురక్షితమైన దేశంగా మార్చేందుకు బడ్జెట్ 2025 ఒక ముఖ్యమైన దశను సూచిస్తుందని చెప్పారు.
Also Read : Budget 2025: కేంద్ర బడ్జెట్ ప్రజెంటేషన్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి, ఏ సమయంలో బడ్జెట్ ఉంటుంది?
మరిన్ని చూడండి