How was Madha Gaja Raja Telugu performance మదగజరాజా తెలుగు పెరఫార్మెన్స్ ఎలా ఉంది


Fri 31st Jan 2025 09:07 PM

madha gaja raja  మదగజరాజా తెలుగు పెరఫార్మెన్స్ ఎలా ఉంది


How was Madha Gaja Raja Telugu performance మదగజరాజా తెలుగు పెరఫార్మెన్స్ ఎలా ఉంది

తమిళనాట సుందర్ సి దర్శకత్వంలో విశాల్ హీరోగా 12 ఏళ్ళ క్రితం తెరకెక్కిన మదగజరాజ చిత్రం అక్కడ తమిళ్ లో పొంగల్ స్పెషల్ గా విడుదలైంది. 12 ఏళ్ళ కనేంట్ ను, 12 ఏళ్ళ క్రితమే తెరకెక్కిన సినిమాని తమిళ ఆడియన్స్ ఆదరించడం కాదు సూపర్ హిట్ చేసారు. అక్కడ హిట్ అయిన మదగజ రాజా చిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చేసి ఈరోజు విడుదల చేసారు. 

అయితే తమిళ్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన అరిగిపోయిన మదగజరాజ చిత్రం తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది అనే చెప్పాలి. కొన్నాళ్లుగా విశాల్ మర్కెట్ తెలుగులో డౌన్ ఉంది. ఇక మదగజరాజ 12 ఏళ్ళ క్రితం కంటెంట్. అందుకే సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ వస్తే అపుడు చూద్దాంలే అన్నట్టుగా ఉన్నారు తెలుగు ఆడియన్స్. 

మదగజరాజ లో అక్కడక్కడా కామెడీ కనెక్ట్ అవ్వడం, విశాల్ పెరఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్, సంతానం కామెడీ మదగజరాజ కు హైలెట్ కాగా.. అరిగిపోయిన కథ, కొత్తదనం లేకపోవడం, రొటీన్ కథనం, లాజిక్ లేని సీన్స్ ఇలా మదగజ రాజా మైనస్ లు గా మిగిలాయి. గత వారం సినిమాలు అన్ని ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యడంలో విఫలమవడంతో మదగజ రాజాకు ఈ వారం ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూడాలి. 


How was Madha Gaja Raja Telugu performance:

Madha Gaja Raja releasing Telugu





Source link