Economic Survey: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(A.I)……ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. భవిష్యత్ తరం మొత్తం ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం చుట్టూ పరుగులెత్తాల్సిందేనంటూ ప్రపంచం కోడైకూస్తోంది. కొన్ని వేలమంది చేసే పనిని ఒక్క చిటికెలో చేయగలగడం దీని ప్రత్యేకత…ఒకరకంగా చెప్పాలంటే దీన్ని సృష్టికి ప్రతి సృష్టి అని చెప్పొచ్చు. అయితే దీనివల్ల లాభాలు ఎంతున్నా….నష్టాలు అదే మాదిరిగా ఉన్నాయి. కొన్ని కోట్లమంది జీవితాలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. దీని విపరీత పరిణామాలు ఇప్పటికే అక్కడక్కడ కనిపిస్తున్నాయి….ఇక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే….పరిస్థితి ఏంటో మన ఆర్థిక సర్వే(Economic Survey) చెప్పకనే చెప్పింది.
ఆరోగ్య పరిరక్షణ,ఆర్థిక అంశాలు సహా విద్య, పరిశోధనల పరంగా ఆటోమేషిన్ ద్వారా గణనీయమైన మార్పులు రాబోతున్నాయని ఏఐ(A.I) డెవలపర్స్ చెబుతున్నప్పటికీ…ఈ మార్పులు విపరీత పరిణామాలకే దారితీయవచ్చని ఆర్థికసర్వే హెచ్చరించింది. బడ్జెట్(Budget)కు ముందు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టడం ఆనవాయితీలో భాగంగా నిర్మలమ్మ…పార్లమెంట్ ముందుకు 2024-25 ఆర్థిక సర్వేను తీసుకొచ్చారు.మధ్య,దిగువత తరగతి ఆదాయం కలిగిన కార్మికుల జీవితాలపై ఏఐ ప్రభావం చూపబోతుందని ఆమె హెచ్చరించారు. పెద్ద సంఖ్యలో ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కీలకమైన ప్రాంతాల్లో ఇకపై మానవ అవసరాలు ఉండకపోవచ్చని….ఆ ఖాళీని ఏఐ(A.I) భర్తీ చేసేస్తుదని ఆర్థికసర్వే వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థలో జరిగిన పరిణామాలన్నింటినీ సమీక్షించి ఈ మేరకు నివేదికను పార్లమెంట్(Parlament) ముందుకు తీసుకొచ్చింది.
ఏఐపై ఆర్థిక సర్వే అభిప్రాయం
* ఆరోగ్య సంరక్షణ, పరిశోధన, వ్యాపారం, విద్య, నేర న్యాయం,ఆర్థిక సేవలతో సహా వివిధ రంగాల్లో కీలకమైన నిర్ణయాలను తీసుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ వనరులను అధిగమించే అవకాశం ఉందని అంచనా వేసింది. మధ్య, దిగువ తరగతి కార్మికులపై పెద్ద ఎత్తున దీని ప్రభావం పడే అవకాశం ఉంది. చాలామంది ఉపాధి,ఉద్యోగ అవకాశాలను కోల్పోవచ్చని హెచ్చరించింది.
* గతంలో మాదిరి పారిశ్రామి, సాంకేతిక విప్లవాలతో పోలిస్తే….ప్రస్తుత ఏఐ స్వీకరణ ప్రతికూల ప్రభావాల భయాలు అంతగా పైకి కనిపించకపోవచ్చని అభిప్రాయపడింది.
* భారత్ ముఖ్యంగా సేవలరంగాపై ఆధారపడిన దేశం కావడంతో ఏఐ ప్రభావం ముందుగా ఐటీ ఉద్యోగాలపైనే పడే అవకాశం ఉంది. చిన్నచిన్న సంస్థలు మూతపడనున్నాయని….ఆటోమెషిన్ ద్వారా ఉద్యోగులకు ముప్పు తప్పదని హెచ్చరించింది. చాలా సంస్థలు ఖర్చుల భారాలు తగ్గించుకునేందుకు ఉద్యోగులను,కార్మికులను తొలగించి యంత్రాలనే పెట్టుకునే అవకాశం ఉంది.
Also Read: వికసిత్ భారత్‌కు, ఆ వర్గాల అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర బడ్జెట్ – నేటి సమావేశాలకు ముందు మోదీ
ఎదుర్కొవడం ఎలా..?
* భారత్ ఇలాంటి ఒడిదొడుకులను ఎన్నో చూసింది. కలిసికట్టుగా ప్రయత్నిస్తే….దీని ముప్పు నుంచి తప్పించుకోవడం కూడా సులువేనని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఏఐ ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి సామూహిక సామాజిక ప్రయత్నం చేయాలని సూచించింది. ప్రభుత్వం, ప్రైవేట్‌రంగం,విద్యాసంస్థల మధ్య సహకారంతో భారత్ బలమైన సంస్థలను సృష్టించాలని తెలిపింది.
* నైపుణ్య సంస్థలను పెద్దఎత్తున ఏర్పాటు చేసి ఉద్యోగులను ఏఐతో మమేకం చేయాలని…కార్మికులను సైతం దీనికి సన్నద్ధం చేయాలని సూచించింది
* ఏఐను ఇప్పటికీ చాలామంది ప్రజలు విశ్వసించడంలేదు. ప్రజాభిమానం చూరగొనకుండా ఏ సంస్థ మనుగడ సాధించలేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు కార్మికులు,ఉద్యోగులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.
*యువశక్తి భారత్‌కు ఉన్న అదనపు బలం..వారికి సరైన మార్గంలో నైపుణ్య శిక్షణ అందిస్తే…పని ఉత్పాదన పెంచవచ్చు. ఏఐని ఉపయోగించగల శ్రామిక శక్తిని సృష్టించగల శక్తి,సామర్థ్యాలు భారత్‌కు పుష్కలంగా ఉన్నాయి.
*ఏఐ రాకతో సామాజికపరంగా వచ్చే మార్పులు సైతం శాశ్వతంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున….డెవలపర్స్ సైతం సమాజహితాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read: కేంద్ర బడ్జెట్ ప్రజెంటేషన్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలి, ఏ సమయంలో బడ్జెట్ ఉంటుంది?
మరిన్ని చూడండి