Something very powerful going to happen Donald Trump on taking Panama Canal

Donald Trump on Panama Canal: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ, కఠిన నిబంధలు విధిస్తున్న డొనాల్డ్​ ట్రంప్​.. కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలతో విరుచుకుపడ్డారు. తాజాగా పనామా కాలువ మీద దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే పనామా కాలువ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ జలమార్గాన్ని చైనాకు అప్పగించలేదని, ఒప్పంద ఉల్లంఘన జరిగిందని పేర్కొన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి ‘శక్తవంతమైన చర్య ఉండబోతోంది’ అని వ్యాఖ్యానించారు.

కాలువను తిరిగి తీసుకోవాలనుకుంటున్నాం
ఓ విలేకరుల సమావేశంలో ట్రంప్​ మాట్లాడుతూ..‘పనామా కాలువను మేము చైనాకు ఇవ్వలేదు. దాన్ని ఆ దేశం పరోక్షంగా నిర్వహిస్తోంది. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. అందుకే కాలువను తిరిగి తీసుకోవాలనుకుంటున్నాం. ఇందుకు సంబంధించి త్వరలోనే చాలా శక్తిమంతమైన చర్య జరగబోతోంది’ అని అన్నారు. అయితే దీనికి బలగాల అవసరం ఉండకపోవచ్చన్నారు.

ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనే పంతం
అగ్రరాజ్యం అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి  ప్రమాణ స్వీకారం చేసినప్పుడే పనామా కాలువపై నియంత్రణ తీసుకుంటానని హెచ్చరించారు. పనామా ఆధీనంలోనే కాలువ ఉన్నా.. దానిపై చైనా జోక్యం, నియంత్రణ ఎక్కువైందని అగ్రరాజ్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ కాలువపై పట్టు సాధించేందుకు అమెరికా పావులు కదుపుతోంది. ‘ప్రపంచంలోని అద్భుతం’గా అభివర్ణించే ట్రంప్​.. ఆ కాలువను ఎలాగైన తమ ఆధీనంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.

వేలాది మంది కార్మికుల జీవితాలను పణంగా పెట్టి నిర్మాణం
పనామా కాలువను 1914లో అమెరికా నిర్మించింది. బార్బడోస్, జమైకా మరియు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ఆఫ్రికన్ సంతతికి చెందిన వేలాది మంది కార్మికుల జీవితాలను పణంగా పెట్టి ప్రారంభించింది. ఆ తర్వాత 1999లో ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు అప్పటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ దీనిని బీజింగ్ నిర్వహిస్తుందంటూ పనామాకు అప్పగించారు. అయితే, అమెరికా వాణిజ్య, నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని.. వీటిని తగ్గించాలని ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే ఆ కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించడంతో ఇరుదేశాల మధ్య వివాదం రాజుకుంది.

చైనా జోక్యాన్ని అడ్డుకోకపోతే తగిన చర్యలు
ఇదిలా ఉండగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆదివారం పనామా అధ్యక్షుడు జోస్‌రౌల్‌ ములినోతో భేటీ అయ్యారు. పనామా కాలువ విషయంలో చైనా జోక్యాన్ని, నియంత్రణను అడ్డుకోవాలని, లేదంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ భేటీ అనంతరం పనామా అధ్యక్షుడు గట్టిగా బదులిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. అమెరికా దురాక్రమణకు మేం భయపడబోం అని వెల్లడించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే శక్తవంతమైన చర్య ఉండబోతోందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగిన పనామా
అయితే పనామాను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని ట్రంప్​ వ్యాఖ్యలతో భయపడినట్లు కనిపిస్తున్న పనామా అధ్యక్షుడు జోస్‌రౌల్‌ వెంటనే వెనక్కి తగ్గారు. చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ నుంచి తాము వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌లో చేరేందుకు 2017లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించబోమని ఆయన స్పష్టం చేశారు.

Also Read: Donald Trump : ట్రంప్ టారిఫ్‌ల మోత,- ఆ 3 దేశాలకు షాకిచ్చిన అమెరికా – సుంకాలపై కీలక నిర్ణయం

మరిన్ని చూడండి

Source link