Sankranthiki Vasthunnam Creates History ఆ ముగ్గురిని ఛాలెంజ్ చేసిన వెంకీ


Mon 03rd Feb 2025 03:27 PM

sankranthiki vasthunnam  ఆ ముగ్గురిని ఛాలెంజ్ చేసిన వెంకీ


Sankranthiki Vasthunnam Creates History ఆ ముగ్గురిని ఛాలెంజ్ చేసిన వెంకీ

సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరు, నందమూరి బాలయ్య, కింగ్ నాగ్ లకు విక్టరీ వెంకటేష్ టార్గెట్ సెట్ చెయ్యడమే కాదు ఛాలెంజ్ చేసారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో 300 కోట్ల గ్రాస్ ని సాధించి బిగ్ మార్క్ ని చేరుకున్నారు. వెంకటేష్ కెరీర్ లోనే 300 కోట్లు అనేది బిగ్ నెంబర్. 

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూడు వారాలు పూర్తి చేసుకునేలోపు 300 కోట్లు కొల్లగొట్టి రికార్డ్ క్రియేట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. మరి మెగాస్టార్ చిరు, బాలయ్య, నాగార్జున అభిమానులు తమ హీరోలు కూడా ఇలాంటి రేర్ ఫీట్ అందుకోవాలని కలలు కంటున్నారు. 

వెంకటేష్ చాలా ఈజీగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో 300 కోట్ల మార్క్ ని టచ్ చేసారు. మరి చిరు కి, బాలయ్యకు, నాగ్ కి ఎప్పటికి ఈ మార్క్ టచ్ చేస్తారో అని ఆయా హీరోల అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అదంత ఆషామాషీ కాదు, కానీ కంటెంట్ ఉన్న కథ తగిలితే అదేమంత కష్టము కాదు. 


Sankranthiki Vasthunnam Creates History:

Sankranthiki Vasthunnam Is The Only Film Grossing 300 Crore Mark In South





Source link