Vehicle Insurance: కారు, బైక్ ఇలా ఏ వాహనం ఇన్నా దాన్ని డిజైన్ నుంచి ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా చూసుకనే వ్యక్తులు ఓ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. అదే ఇన్సూరెన్స్. ఇకపై అలా చేయడం కుదరదు. ముఖ్యంగా కారు సహా భారీ వాహనాలు కలిగి ఉన్న వాళ్లు ఇకపై కచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించాల్సిందే. లేకుంటే భారీ జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది.
టోల్గేట్లకు ఇన్సూరెన్స్ చెకింగ్ బాధ్యత
ఇలా ఇన్సూరెన్స్ గుర్తింపు బాధ్యతను టోల్‌గేట్స్‌కు కేంద్రం అప్పగించింది. ఇప్పటి వరుక కొన్ని ప్రాంతాలకు పరిమితమైన ఈ విధానం దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. మొదటగా ఒడిశా రాష్ట్రంలో ఉన్న టోల్గేట్లకు ఈ డిటెక్షన్ పరికరాలు అమర్చారు. ఇది వచ్చిన వాహనానికి ఇన్సూరెన్స్ ఉందో లేదో క్షణాల్లో చెప్పేస్తోంది. ఇన్సూరెన్స్ లేకుంటే వెంటనే ఫోన్ మోగుతుంది. ఇన్సూరెన్స్ లేని కారణంగా మీరు రెండు వేల రూపాయల జరిమానా విధిస్తున్నట్టు అందులో ఉంటుంది.
టోల్గేట్ దాటితే జరిమానా మెసేజ్
దేశంలోని దాదాపు అన్ని వాహనాల నెంబర్లు డిజిటర్ అయిపోయాయి. ఒక నెంబర్ డేటా బేస్‌తో చూసుకుంటే అన్ని వివరాలు వచ్చేస్తున్నాయి. ఆ వాహనం కండీషన్ కూడా వచ్చేస్తే పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందో లేదో తెలిసిపోతోంది. అందుకే ఇప్పుడు టోల్ గేట్లకు ఈ రెండు గుర్తించే బాధ్యత అప్పగించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఒడిశాలోని 22 టోల్గేట్లో ఈ డిటెక్షన్ విధానం అమలులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ లేని వాళ్లకు టింగ్‌న మెసేజ్ వస్తోంది.
పొలూష్యన్, ఇన్సూరెన్స్‌పై ఫోకస్
చాలా మంది లక్షలు కోట్లు ఖర్చు పెట్టి వాహనాలు కొంటున్నా వేలు ఖర్చు పెట్టి ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్నారు. అలాంటి వారిని దారిలో పెట్టేందుకే ఈ విధానం తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇలా ఇన్సూరెన్స్ లేకుండా తిరగడంతో ప్రమాదకరమని అంటున్నారు. మరికొన్ని వాహనాలుకు కాలుష్యం సర్టిఫికేట్ ఉండటం లేదని అంది కూడా చేటు చేస్తోందని వివరిస్తున్నారు. ఈ రెండు లోపాలు కట్టడి చేసేందుకు టోల్గేట్లకు ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది కేంద్రం.
Also Read: లక్ష రూపాయల కంటే తక్కువ ధరకు అదిరిపోయే మైలేజీ, ఫీచర్లు ఉండే బైక్‌లు ఇవే
ఈ డిటెక్షన్ విధానంతో గుర్తింపు
టోల్గేట్ల వద్ద అమర్చిన ఈ డిటెక్షన్ విధానంతో ఇప్పుడు టోల్ ఛార్జ్ కట్ అయినట్టుగానే పని చేస్తుంది. వాహనం నెంబర్ చూసి ఆ వాహనానికి చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ ఉందో లేదో పరిశీలిస్తుంది. ఇన్సూరెన్స్ లేకుంటే వెంటనే ఆ వాహనం రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్‌కు జరిమానా మెసేజ్ వస్తుంది. ఇన్సూరెన్స్ లేకుండా మొదటిసారి చిక్కితే 2000 రూపాయల ఫైన్ వేస్తారు. లేకుంటే మూడు నెలలు జైలు శిక్ష విధించవచ్చు. లేదంటే రెండూ విధించే ప్రమాదం కూడా ఉంది. రెండోసారి చిక్కితే దాన్ని రెట్టింపు చేస్తారు. అంటే నాలుగు వేల ఫైన్ వేస్తారు.
ఒడిశా, బిహార్‌లో అమలు
ఒడిశాలో ఫిబ్రవరి నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. అంతకు ముందే బిహార్‌లో కూడా అమలులోకి వచ్చింది. అక్కడ మొత్తం 32 టోల్ గేట్ల వద్ద దీన్ని అమర్చి ఉన్నారు. ఒడిశాలో ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ లేకుంటే మాత్రమే జరిమానా వేస్తున్నారు. బిహార్‌లో పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోయినా ఫైన్ కట్టించుకుంటున్నారు. పది వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దీంతో బెదిరిపోయిన వాహనదారులు పొల్యూషన్ సర్టిఫికేట్స్ కోసం, ఇన్సూరెన్స్ కోసం పరుగులు తీస్తున్నారు. దీంతో టోల్గేట్ల వద్ద ఇప్పటి వరకు ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ సెంటర్లే ఉండేవి ఇప్పుడు ఇన్సూరెన్స్, పొల్యూషన్ చెకింగ్ కేంద్రాలు వెలుస్తున్నాయి.
Also Read: రూ.7 లక్షల బడ్జెట్లో కారు కోసం చూస్తున్నారా? ఈ లిస్ట్ ఒక్కసారి పరిశీలించండి !
మరిన్ని చూడండి