నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చ-telangana assembly special meeting today discussion on implementation of sc classification bc reservations ,తెలంగాణ న్యూస్

ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫార్సు

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ ఎస్సీ ఉప కులాలను నాలుగు కేటగిరీలుగా విభజించాలని సిఫార్సు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబాటు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదికను రూపొందించినట్టు చెబుతున్నారు. తొలి కేటగిరీలో అత్యంత వెనుకబడిన ఉప కులాలు, రెండో క్యాటగిరీలో మాదిగ, మాదిగ ఉపకులాలు, మూడో కేటగిరీలో మాల, మాల ఉపకులాలు, నాలుగో క్యాటగిరీలో ఇతర ఉప కులాలను చేర్చినట్లు తెలుస్తోంది.

Source link