Thought 70 Hour 90 Hour Work Week Advice Was Too Much Elon Musk Calls For 120 Hour Work Schedule At DOGE | 120 Hour Work : ఇన్‌ఫోసిస్, ఎల్ అండ్ టీ పెద్దలనుకుంటే వాళ్ల తాత ఎలాన్ మస్క్

Elon Musk Calls For 120 Hour Work Schedule At DOGE : ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి 7 గంటలు పని చేయాలని ప్రకటిస్తే పెద్దాయనది చాదస్తం అన్నారు. ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ 90 గంటలు అంటే .. ఆయనకేమీ చాలా చెబుతారు.. ఆయనకు కావాల్సింది బానిసలది ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు వారిద్దరిని మించిన వ్యక్తి వచ్చారు..ఆయన ఎలాన్ మస్క్. ఆయన వారానికి 120 గంటల వర్క్ టైమ్ ను ఫిక్స్ చేశారు. చెప్పడం కాదు..అమలు చేసేస్తుతున్నారు. ట్రంప్ తనకు ఇచ్చిన ఎఫిషియన్సీ విభాగం డోజ్ లో పని చేసే వారికి వారానికి నూట ఇరవై పని గంటలు ఉంటాయని ప్రకటించారు. 

బ్యూరోక్రాట్లు వారానికి 40 గంటలు పనిచేస్తారు కానీ డోజ్ లో మాత్రం నూట ఇరవై గంటల పని ఉంటుందన్నారు.  బ్యూరోక్రసీలో చాలా తక్కువ మంది వారాంతంలో పని చేస్తారన్నారు.ఇటీవల డోజ్ లో ఆరుగురు కుర్రవాళ్లను ఎంపిక చేసుకున్నారు మస్క్. వారందరికీ సున్నితమైన సమాచారం అందుబాటులో ఉంచుతారు. వారు అమెరికా ఉద్యోగుల ఎఫియన్సీ పెంచుతారని అంటున్నారు.   

మస్క్ 120 గంటల  పనిపై చాలా మంది భిన్నంగా స్పందించారు. కొంత మంది ఉద్యోగులు వారంలో రెండు రోజులు సెలవు తీసుకుంటున్నారని, వారు మిగతా అన్ని రోజులలో 24 గంటలు పని చేస్తున్నారని చూపించే కొన్ని గణాంకాలను పోస్ట్ చేశారు. కొంత మంది మరింత ఫన్నీగా స్పందించారు. డోజ్  గ్రహాంతరవాసులు , రోబోలు , ఎలోన్‌లతో రూపొందించారని సెటైర్లు వేశారు.  

పని గంటల సంఖ్య ఎల్లప్పుడూ విజయానికి దారితీయదని ..ఆ గంటల నాణ్యత, నిర్ణయాల ప్రభావం కీలకమని మరొకరు చెప్పారు.  

ఎలాన్ మస్క్ ఆలోచన ట్రంప్ కు నచ్చితే అక్కడి ఉద్యోగుల పని గంటల సంఖ్యను 120కి పెంచినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. భయం కూడా అక్కడి ఉద్యోగుల్లో కనిపిస్తోంది. 

 

మరిన్ని చూడండి

Source link