వైసీపీ లో నెంబర్ 2 అంటూ చెప్పుకునే విజయ సాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చెయ్యడమే కాదు వైసీపీ పార్టీకి కూడా బై బై చెప్పేసి ఇకపై రాజకీయాల్లో ఉండను అంటూ ప్రకటించడం పై ఎవరు ఎలా అనుకున్నా జగన్ మోహన్ రెడ్డి మాత్రం బిగ్ షాకయ్యే ఉంటారు. కానీ ఆయన లండన్ లో ఉండడంతో ప్రత్యక్షంగా విజయ్ సాయి రెడ్డి ఇష్యుపై ఇప్పటివరకు స్పందించలేదు.
తాజాగా జగన్ ప్రెస్ మీట్ లో గతంలో వెళ్లిన ముగ్గురు కానీ, ఇప్పుడు విజయ్ సాయి రెడ్డి కాని, అలాగే ఇకపై వెళ్ళేవాళ్ళకు కలిపి కౌంటర్ ఇచ్చారు. 11 మంది మా శాసనసభ్యులు, పోయినోళ్ళెంతమంది ముగ్గురు పోయారా, పోయేవాళ్ల ప్రతి ఒక్కళ్ళకి నేను ఒకటే మాట చెబుతున్నాను, రాజకీయాల్లో ఉన్నప్పుడు కేరెక్టర్ ఉండాలి, క్రెడిబులిటీ అనే పదానికి అర్ధం తెలిసి ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు కలర్ ఎగరేసుకుని పోవాలి.
ముఖ్యమంత్రి అయినా, ఎమ్యెల్యే, ఎంపీ అయినా సరే. ఎవరి గురించి అయినా సరే గొప్పగా చెప్పుకోవాలి. కానీ ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత.. మన కేరెక్టర్ ని మనం చంపుకోవడమేమిటీ. ప్రతిఒక్కరు రాజకీయాల్లో ఆలోచన చెయ్యాలి, కష్టం ఎల్లప్పుడు ఉండదు, సాయి రెడ్డికి అయినా అంతే, పోయిన ముగ్గురు ఎంపీలకైనా అదే. ఇకపై వెళ్ళబోయే వాళ్లకైనా అదే. వైసీపీ ఉంది అంటే అది వీళ్లందరి వల్ల లేదు, దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్లే ఉంది.. అంటూ జగన్ మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి రాజీనామాపై రియాక్ట్ అయ్యారు.