Fans fire on VD for ignoring Rashmika రష్మిక ను విజయ్ నెగ్లెట్ చేస్తున్నాడా..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ సరసన చావా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దినేష్ విజన్ దివ్యాంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. ఇందులో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చావా మూవీని ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం రష్మిక ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉంది.

ఇదిలా ఉంటే రష్మిక తాజాగా సికందర్, థామ, కుబేర, ది గర్ల్‌ఫ్రెండ్, రెయిన్ బో వంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాలతో పాటు రష్మిక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో దయ చూపించండి అంటూ ఒక మెసేజ్ షేర్ చేయడంతో నెటిజన్లు దీనిపై చర్చించుకోవడం ప్రారంభించారు.

రష్మిక తను ధరించిన టీషర్ట్‌పై Kindful అనే పదం కనిపించడంతో ఆమె పరోక్షంగా ఏదైనా సందేశం ఇస్తున్నదా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో రష్మిక సంబంధాన్ని నెటిజన్లు మళ్లీ చర్చించసాగారు.

అసలు విషయం ఏమిటంటే.. రష్మిక విజయ్ దేవరకొండ కలిసి జిమ్‌కు వెళ్లిన వీడియో ఒకటి వైరల్ అయింది. జిమ్ నుండి బయటకు వస్తున్న సమయంలో రష్మిక కాలికి గాయం కావడంతో నడవడంలో ఇబ్బంది పడింది. అయితే పక్కనే ఉన్నా విజయ్ దేవరకొండ ఆమెకు సహాయం చేయకుండా నిశ్శబ్దంగా కారులోకి వెళ్లిపోయాడు. ఈ ఘటన చూసిన నెటిజన్లు విజయ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

ఈ వివాదానికి రష్మిక తన పోస్ట్ ద్వారా సమాధానం ఇచ్చిందా ? లేదా సాధారణంగా మానవత్వం గురించి మాట్లాడిందా ? అనే విషయంపై అభిమానులు ఇంకా చర్చించుకుంటున్నారు.

Source link