గత తొమ్మిది నెలల్లో కూటమి ప్రభుత్వంలో పని చేసిన మంత్రుల పని తీరు ఆధారంగా మంత్రులకు సీఎం చంద్రబాబు ర్యాంక్ లు ప్రకటించారు. ఈ ర్యాంక్ ల్లో లోకేష్ కన్నా డిప్యూటీ హోదాలో హడావిడి చేస్తున్న పవన్ కళ్యాణ్ ర్యాంక్ తక్కువ ఉండడంపై జనసైనికులు మండిపడుతున్నారు. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు ఆయా మంత్రుల పనితీరుని పైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ర్యాంకుల నిర్ణయం జరిగింది.
ఈ ర్యాంక్ ల్లో మొదటి స్థానంలో మంత్రి ఫరూఖ్ ఉంటే రెండో స్థానంలో కందుల దుర్గేశ్ నిలిచారు. ఇక మూడవ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్, నాలుగో స్థానంలో నాదెండ్ల మనోహర్, ఐదవ స్థానంలో బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు. ఐదవ స్థానంలో బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుమాత్రం 6వ స్థానంలో ఉన్నారు.
7వ స్థానంలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిలిచారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ 8వ స్థానంలోనూ బీసీ జనార్ధన్ రెడ్డి 9వ స్థానంలోనూ ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉన్నారు. 11వ స్థానంలో మంత్రి సవిత, 12వ స్థానంలో కొల్లు రవీంద్ర నిలిచారు. 13వ స్థానంలో గొట్టిపాటి రవికుమార్, 14వ స్థానంలో నారాయణ, 15వ స్థానంలో టీజీ భరత్ ఉన్నారు. ఇక 16వ స్థానంలో ఆనం రాంనారాయణ రెడ్డి, 17వ స్థానంలో అచ్చెన్నాయుడు, 18వ స్థానంలో రాం ప్రసాద్ రెడ్డి ఉన్నారు.
ఈలెక్కన పవన్ పని తీరుకన్నా లోకేష్ పనితీరు నచ్చబట్టే ఆయనకు ఏదో స్థానం ఇచ్చారు, పవన్ కళ్యాణ్ కు పదో స్థానం ఇచ్చారు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇది చూసి హోమ్ మంత్రినే లెక్క చెయ్యని పవన్ కళ్యాణ్ పని తీరులో టాప్ లేపుతుంటే ఇంత తక్కువ సస్థానం ఇవ్వడమేమిటి అంటూ పవన్ ఫ్యాన్స్, జనసైనికులు మండిపడుతున్నారు.