AIMIM Fails to Win in Delhi but Influences Election Outcome Through Vote Split

Vote Split : ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించడంలో ఓట్ల విభజన కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్‌కు చెందిన ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పోటీ చేసిన రెండు ఢిల్లీ నియోజకవర్గాలలో కూడా ఇదే జరిగింది. లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని AIMIM, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ఏడు ఢిల్లీ నియోజకవర్గాలలో రెండు ఓఖ్లా,  ముస్తఫాబాద్‌లలో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టింది. రాజధానిలో తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది ఈ పార్టీ. ఈ రెండూ స్థానాల్లోనూ రెండవ స్థానానికే పరిమితం అయినప్పటికీ ప్రతిపక్షాల ఓటు విభజన ముస్తఫాబాద్‌లో బిజెపి విజయానికి ఒక కారకంగా మారింది.

ఓటు చీలికలో ప్రధాన పాత్ర
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాదుకు చెందిన AIMIM)పార్టీ ఈసారి తొలిసారి పోటీకి దిగింది. అయితే, ఏ ఒక్క సీటు గెలవకపోయినా ఓటు చీలికలో ప్రధాన పాత్ర పోషించి కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసింది. AIMIM ప్రధానంగా ఒఖ్లా, ముస్తఫాబాద్ నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ చేసింది. ఈ రెండు ప్రాంతాల్లో ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువ. AIMIM అభ్యర్థులు గెలవలేకపోయినా, వారి మద్దతు వల్ల ప్రతిపక్ష ఓట్లు చీలిపోయి ముస్తఫాబాద్‌లో భారతీయ జనతా పార్టీ (BJP) గెలిచేలా చేసింది.

Also Read : CM Revanth Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి

ముస్తఫాబాద్‌లో ఏం జరిగింది?
2020 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్తఫాబాద్ సీటును ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కు చెందిన హాజీ యూనుసు గెలుచుకున్నారు. కానీ, ఈసారి బీజేపీ ఈ స్థానాన్ని చేజిక్కించుకుంది. బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిష్ట్ కు  85,215 ఓట్లు పోలయ్యాయి.  ఆప్ అభ్యర్థి అదీల్ అహ్మద్ ఖాన్ కు 67,637 ఓట్లు పడ్డాయి. AIMIM అభ్యర్థి తాహిర్ హుస్సేన్ కు 33,474 ఓట్లు దక్కాయి.  కాంగ్రెస్ అభ్యర్థి అలి మెహదీకి 11,763 ఓట్లు పడ్డాయి. AIMIM అభ్యర్థి తాహిర్ హుస్సేన్ 33,474 ఓట్లు సంపాదించడంతో విపక్ష ఓట్లు చీలిపోయాయి. ఇది బీజేపీకి లబ్ధి చేకూర్చింది.

ఒఖ్లా నియోజకవర్గంలో పరిస్థితి
ఒఖ్లాలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో AAP అభ్యర్థి అమానతుల్లా ఖాన్ విజయం సాధించారు. 2020లో 66% ఓట్లు పొందిన ఆయనకు, ఈసారి 42% ఓట్లకే పరిమితమయ్యారు. ఆప్ అభ్యర్థి అమానతుల్లా ఖాన్ కు 88,948 ఓట్లు  పడ్డాయి.  బీజేపీ అభ్యర్థి మనీష్ చౌదరికి  65,304 ఓట్లు పోలయ్యాయి. AIMIM అభ్యర్థి షిఫా ఉర్ రెహ్మాన్ ఖాన్ కు 39,558 ఓట్లు పడ్డాయి.  కాంగ్రెస్ అభ్యర్థి అరీబా ఖాన్ కు 12,739 ఓట్లు దక్కాయి. AIMIM అభ్యర్థి 39,558 ఓట్లు సాధించడంతో కాంగ్రెస్ నాలుగో స్థానానికి పడిపోయింది. 2020లో మూడో స్థానంలో ఉన్న కాంగ్రెస్, ఈసారి AIMIM పోటీ చేయడంతో మరింత వెనుకబడి పోయింది.

Also Read :Congress : బీజేపీలోకి 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు.. ఆ పార్టీ దుకాణం బంద్ ? – కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు

ఓటు చీలిక ప్రభావం
ముస్తఫాబాద్‌లో బీజేపీ గెలుపుకు AIMIM ఓట్లు చీలిక కారణమయ్యాయి. ఒఖ్లాలో ఆప్ గెలిచినా 2020లో 70,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన అమానతుల్లా ఖాన్, ఈసారి కేవలం 24,000 ఓట్ల తేడాతోనే గెలిచారు. AIMIM పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మరింత క్షీణించింది. AIMIM ఖాతా తెరవకపోయినా  తన ప్రభావాన్ని అక్కడ చూపించగలిగింది. ముఖ్యంగా ముస్తఫాబాద్‌లో బీజేపీ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించింది. AIMIM రాకతో కాంగ్రెస్ మరింత బలహీనపడగా ఆప్ కి కూడా తీవ్రమైన పోటీ ఏర్పడింది.

మరిన్ని చూడండి

Source link