విజయవాడలో భారీ అగ్నిప్రమాదం, కాలిబూడిదైన ఎగ్జిబిషన్‌, లక్షల్లో ఆస్తి నష్టం.. అనుమతులపై అనుమానాలు-massive fire in vijayawada exhibition gutted property loss in lakhs ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Vja Fire Accident: విజయవాడ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సితార సెంటర్‌లో ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో మంటలు చెలరేగి దుకాణాలు కాలి బూడద అయ్యాయి. ప్రైవేట్‌ వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు ఎలాంటి అనుమతులు లేవనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక రాజకీయ నాయకుల అండతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. నగరంలో గత కొన్నేళ్లుగా ప్రైవేట్‌ స్థలాల్లో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయడం, పోలీసులు, ఫైర్‌ సిబ్బంది వాటిని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. నగరంలోని కృష్ణా తీరంలో ఉన్న ఖాళీ స్థలంతో పాటు పలు ప్రాంతాల్లో ఏడాది పొడవున ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వీటికి ఎలాంటి రక్షణ ఏర్పాట్లు ఉండటం లేదు.

Source link