తల మూవీ రివ్యూ
ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు దర్శకుడు అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్ ను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ దీప ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించిన చిత్రం తల. దర్శకుడిగా కష్టపడి పని చేసే అమ్మ రాజశేఖర్.. కొడుకుని హీరో గా ఇంట్రడ్యూస్ చేస్తూ తల మూవీని భారీ గా ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించారు. ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చిన తల మూవీ రిజల్ట్ ఏమిటి అనేది సమీక్షలో చూసేద్దాం..
తల కథ :
రాజన్ రాజ్ తల్లి తను ప్రేమించి పెళ్లాడిన వ్యక్తి దూరమై అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా రాజ్ తన తల్లి ఆవేదన తీర్చాలనే సంకల్పంతో తండ్రిని వెతుక్కుంటూ వెళ్తాడు. రాజ్ తన తండ్రిని ఎలా చేరుకున్నాడు, కుటుంబంలోకి ఎలా వెళ్తాడు, తండ్రిని వెతికే క్రమంలో రాజ్ కు ఎదురైన సంఘటనలు ఏమిటి, తనకు పరిచయమైన అమ్మాయి అంకిత-రాజ్ చివరికి కలిసారా లేదా? అనేది తల షార్ట్ స్టోరీ.
నటీనటుల నటన:
అమ్మ రాజశేఖర్ తనయుడు గా అమ్మ రాగిన్ రాజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన, నటించిన తొలి చిత్రంతోనే మంచి నటనను కనబరిచాడు. ప్రతి సీన్ లో ప్రతి ఎమోషన్, నటన లో పరిపక్వత కనబర్చి నటుడు గా తొలి చిత్రంతోనే ప్రూవ్ చేసుకున్నాడు. హీరోయిన్ అంకిత అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. అదేవిధంగా చాలాకాలం తర్వాత తెరపైకి వచ్చిన రోహిత్ హీరో తండ్రి పాత్రలో తనదైన శైలిలో నటించి ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఎస్తేర్ నోరోన్హా తన పాత్ర పరిధి మేరకు నటించి ఎమోషన్ ని సీన్స్ పండించారు. ఈ సినిమాలో నటించిన మిగతా వారు అజయ్, సత్యం రాజేష్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ వంటి వారు ఈ చిత్రానికి మరొక ప్లస్ పాయింట్ గా నిలిచారు.
సాంకేతిక విశ్లేషణ :
ఈ చిత్రానికి కథనం, కథా బలం చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. అమ్మాయి కోసం ప్రాణాలు ఇస్తున్న జనరేషన్లో అమ్మకోసం ఇంత కష్టపడే కొడుకు కథగా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ కథను తెరపైకి తీసుకువెళ్లడంలో దర్శకుడిగా అమ్మ రాజశేఖర్ విజయం సాధించారు. ఈ కాలం కి తగినట్టుగా స్క్రీన్ ప్లే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అలాగే చిత్రంలోని పాటలు, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి. చిత్రంలోని పాటలు, లిరిక్స్ బాగున్నాయి. చిత్రంలోని యాక్షన్ సీన్స్ ఇంటెన్స్ గా ప్రేక్షకులు ను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. టెక్నికల్గా నిర్మాణపరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి విలువలతో అలాగే బిఎఫ్ ఎక్స్ కూడా అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు. డిఓపి గా శ్యామ్ కె నాయుడు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్ గా నిలుస్తుంది. అమ్మ రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనే విధంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ చిత్రం అంతా ఉత్తర ప్రదేశ్ లోని రియల్ లొకేషన్స్ లో నాచురల్ గా నిర్మించారు
ప్లస్ పాయింట్స్:
కథ, దర్శకత్వం, రాగిన్ రాజ్ నటన, సాంగ్స్, డిఓపి, ఎడిటింగ్ వర్క్.
మైనస్ పాయింట్స్:
BGM
రేటింగ్: 2.25/5