20 CMs including ap cm chandra babu and 50 Celebrities Business Tycoons are Are Invited To Delhi CM Swearing In Ceremony

Delhi CM Swearing-In Ceremony: ఢిల్లీలో భారీ విజయం సాధింంచిన బీజేపీ అక్కడ ప్రభత్వ ఏర్పాటుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అతిరథ మహారథులను ఆహ్వానించి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని ఫిబ్రవరి 20న చేపట్టాలని కమలనాథులు భావిస్తున్నారు. 

ఫిబ్రవరి 20 (గురువారం) సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. రాజధానిలోని రాంలీలా మైదానంలో ముఖ్యమంత్రితోపాటు మంత్రిమండలి కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

రాంలీలాలో జరిగే కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు 50 మందికిపైగా హై సెక్యూరిటీ నాయకులు హాజరవుతారు. ఈ కార్యక్రమానికి బిజెపి పాలిత 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నాయకులతో సహా అగ్ర బిజెపి నాయకులను ఆహ్వానించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం రానప్పటికీ షెడ్యూల్ అయితే ఖరారు అయినట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల సమయంలో తెలుగు వారు ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేశారు. అక్కడ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు. 

ఢిల్లీ ప్రమాణ స్వీకారోత్సవానికి రాంలీలా మైదానంలో ఈ గ్రాండ్ వేడుకకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 70 మంది సభ్యుల అసెంబ్లీలో 48 సీట్లను గెలుచుకుని 26 సంవత్సరాల విరామం తర్వాత బిజెపి ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చింది.

న్యూఢిల్లీ స్థానం నుంచి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన బీజేపీ నేత పర్వేశ్‌ వర్మ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ ఢిల్లీ అత్యున్నత పదవికి పోటీ పడుతున్న వారిలో ఉన్నారు. పవన్ శర్మ, ఆశిష్ సూద్, రేఖ గుప్తా, శిఖా రాయ్ కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న వారిలో ఉన్నారు.
గ్రాండ్ ఈవెంట్‌కు సన్నాహాలు 

ఫిబ్రవరి 20న జరిగే వేడుకకు రాంలీలా మైదానంలో సన్నాహాలు జరుగుతున్నాయి, బీజేపీ నాయకులు వినోద్ తావ్డే, తరుణ్ చుగ్, వీరేంద్ర సచ్‌దేవా మంగళవారం రాంలీలా మైదాన్‌ను సందర్శిస్తారు. అక్కడ ఏర్పాట్లు పరిశీలించారు. హైసెక్యూర్డ్‌ లీడర్లు వస్తున్నందున భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ సౌకర్యులపై ఆరా తీశారు. 

ప్రమాణ స్వీకారం దృష్ట్యా బుధవారం (ఫిబ్రవరి 19) రాత్రి నుంచి రాంలీలా మైదాన్‌కు వెళ్లే అన్ని రహదారులను మూసివేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాంలీలా మైదాన్‌లోకి వీవీఐపీ వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.

Also Read: సుగాలి ప్రీతి కేసులో సీబీఐ చేతులెత్తేసింది- మరి పవన్ నిర్ణయం ఏంటీ? తేలుస్తారా… తేలిపోతారా?

ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న పలువురు ప్రముఖులు
మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, ఇతరులు పాల్గొన్నారు.ఇప్పుుడు ఢిల్లీ ప్రమాణ స్వీకర వేదిక కూడా కలర్‌ఫుల్‌గా మారిపోనుందని టాక్ నడుస్తోంది.  
ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు 30,000 మంది అతిథులను ఆహ్వానించారు. అక్షయ్ కుమార్, వివేక్ ఒబెరాయ్, హేమ మాలిని, కైలాష్ ఖేర్ వంటి బాలీవుడ్ తారలు, 50 మందికిపైగా సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

ప్రముఖులతోపాటు, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు, డజన్ల కొద్దీ పారిశ్రామికవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. బాబా రామ్‌దేవ్, స్వామి చిదానంద్, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. .

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బీజేపీ విజయం కోసం ప్రచారంలో పాల్గొన్న బిజెపి నాయకులు, పార్టీ శ్రేణులను కూడా ఆహ్వానించారు. “లాడ్లీ బెహనాలు” రైతులను కూడా ఆహ్వానించారు.

Also Read: పాలకులు, అధికారుల మధ్య సమన్వయ లోపం- పదే పదే సీఎంలు ‌అసంతృప్తి

మరిన్ని చూడండి

Source link