Bhupalpally District : 'ఎస్సై వేధింపులు తట్టుకోలేకపోతున్నాం' – కలెక్టరేట్‌‌ ఎదుట ఫ్లెక్సీతో దంపతుల నిరసన

ఎస్సై వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. ఆత్మహత్యకు అనుమతించండంటూ వృద్ధ దంపతులు ఆందోళనకు దిగారు. భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ఫ్లెక్సీతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. భూమి బాట విషయంలో వివాదం నెలకొందని… తమపై అక్రమ కేసులు పెట్టారని వాపోయారు. దీంతో ఆర్డీవో వారితో మాట్లాడి నిరసన విరమింపజేశారు. 

Source link