Papa Killed Mummy Hanged Body Girl Drawing Raises Doubt Over Suicide Claim | Viral News: భార్యను చంపి ఉరేసుకుందని చెప్పాడు

Papa Killed Mummy : ఓ వ్యక్తి ఓ హత్య చేస్తాడు. ఆత్మహత్యగా నిరూపించేందుకు ఉరి కూడా వేస్తాడు. పోలీసులు కూడా అదే అనుకుంటారు. అయితే ఆ హత్యను చూసిన ఓ చిన్నారి అక్కడేం జరిగిందో పోలీసులకు డ్రాయిగ్ గీసి చూపిస్తుంది. దాంతో ఆ వ్యక్తిపై పోలీసులు అనుమానంతో దర్యాప్తు చేసి అసలు నిజాన్ని కనుగొంటారు. హంతకుడ్ని అరెస్టు చేస్తారు. ఇలాంటివి చాలా సినిమాల్లో చూసి ఉంటాం. కానీ నిజంగా జరిగితే మాత్రం అద్భుతం అనిపిస్తుంది. ఇలాంటి అద్భుతం ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ అనే పట్టణంలో జరిగింది. 

వివాహిత ఆత్మహత్య – పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త      

యూపీలోని ఝాన్సీ అనే పట్టణంలో కొద్ది రోజుల కిందట 27 ఏళ్ల వివాహిత ఒకరు చనిపోయారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులుక ఫిర్యాదు అందింది. పోలీసులు కూడా అదే కోణంలో విచారణ జరిపారు. కేస్ క్లోజ్ చేయాలనుకున్నారు. కానీ వారికి ఎందుకో అనుమానం వచ్చింది. అందుకే ఆ ఇంట్లో ఉన్న వారి గురించి ఆరా తీశారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఎవరు ఉన్నారో ఆరా తీశారు. ఆ సమయంలో భర్త తో పాటు పాప ఉంది. అయితే తాను వేరే రూమ్‌లో ఉన్నానని భర్త చెబుతున్నారు. 

తండ్రే చంపేసి ఉరేశాడని పోలీసులకు డ్రాయింగ్ గీసి చూపించిన కుమార్తె       

తల్లితో పాటు నాలుగేళ్ల పాప ఉందని గుర్తించారు పోలీసులు. ఆ పాపను ఏం జరిగిందని పోలీసులు అడిగారు. నాలుగేళ్ల పాప అప్పటికే అక్కడ జరిగింది షాక్ లో ఉందేమో కానీ.. ఏమీ చెప్పలేకపోయింది. అయితే పోలీసులకు డ్రాయింగ్ గీసి చూపించింది. మమ్మీని డాడీనే చంపేశాడని.. ఉరి వేశాడని ఆమె డ్రాయింగ్ వేసి చూపించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. వెంటనే చనిపోయన మహిళ భర్తను అుదపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాడు. అయితే అతడు నేరాన్ని అంగీకరించడానికి సి ద్ధంగా లేడు. అందుకే పోస్టుమార్టం రిపోర్టు రాగానే తదుపరి విచారణ చేసి అరెస్టు చూపించాలని నిర్ణంచుకున్నారు.               

పాప డ్రాయింగ్ ఆధారంగా విచారణ జరుపుతున్న పోలీసులు       

తన తండ్రే చంపినట్లుగా ఆ పాప డ్రాయింగ్ గీసి చూపించిన విషయం వైరల్ గా మారింది. కొంత కాలంగా భార్యభర్తల మధ్య సత్సంబంధాలు లేవని తెలుస్తోంది. ఇరువురి మధ్య ఏం జరిగిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. తన తండ్రిపై నాలుగేళ్ల పాప అబద్దాలు చెప్పే అవకాశం లేదను.. జరిగింది హత్య అని.. తన తల్లిని తండ్రే చంపేశాడని కూడా తెలియదు. కానీ జరిగిందేమిటో డ్రాయింగ్ వేసి చూపించింది. అందుకే ఈ కేసును పోలీసులు చాలెంజింగ్ గా తీసుకున్నారు.               

Also Read: Kodali Nani About Red Book: నారా లోకేష్ రెడ్ బుక్‌పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు, 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోవాలంటూ సవాల్

మరిన్ని చూడండి

Source link