Elon Musk Flirty DMs Leaked Mother Of His 13th Child Reveals The Inside Story And Her Pregnancy | Elon Musk: ఎలాన్ మస్కే తన బిడ్డకు తండ్రి అంటున్న యువతి

Elon Musk Flirty:  టెస్లా, ట్విట్టర్, స్పేస్ ఎక్స్ వంటి సంస్థ చీఫ్ గా ఉన్న ఎలాన్ మస్క్ మంచి రసికుడు కూడా. ఆయన ఇప్పుడు పలు పెళ్లిళ్ల ద్వారా పన్నెండు మంది పిల్లలను కన్నారు. తాజగా ఆష్లే అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్, రచయిత ఓ బిడ్డను కని.. ఆ బిడ్డకు ఎలాన్ మస్కే తండ్రి అని  ప్రకటించడం సంచలనంగా మారింది.                

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆష్లే సెయింట్ క్లెయిర్ ఎలాన్ మస్క్ తో తన బంధం గురించి ఇప్పుడు అమెరికా మీడియాకు ఇంటర్యూలు  ఇస్తున్నారు. ఆయనపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. ఆయన మంచి వ్యక్తి .. డౌన్ టు ఎర్త్ అనే కితాబులు ఇస్తున్నారు. తమ బిడ్డ విషయంలో గోప్యత పాటించాలని అనుకుంటున్నట్లుగా ఆమె  చెబుతున్నారు. ఆన్ లైన్ తమకు పరిచయం అయిందని ఆష్లే చెబుతున్నారు.  మస్క్ చాలా ఫన్నీగా ఉండేవాడని తనకు పదే పదే మెసెజులు చేసేవాడని ఆష్లే గుర్తు చేసుకుంటున్నారు.                          

తాను మొదట్లో మస్క్ పై పెద్దగా ఆసక్తి చూపలేదని అన్నారు. అయితే ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాతే అతనిని ఇష్టపడటం ప్రారంభించానని చెబుతున్నారు. ఆ సమయంలో ట్విట్టర్ డీఎం చేసి మీరు ఎప్పుడైనా శాన్ ఫ్రాన్సిస్కో లేదా ఆస్టిన్‌లో ఉన్నారా అని వాకబు చేశారన్నారు.  ఓ ఇంటర్యూ కోసం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లిన తరవాత  ఈ రాత్రి ప్రావిడెన్స్  కి వెళదామని ఆఫర్ ఇచ్చారని తాము అలా వెళ్లామన్నారు. అక్కడే ప్రేమ వికసించిందని..  గర్భవతి అయ్యే వరకు తమ బంధం కొనసాగిందన్నారు.అయితే ఈ విషయం తాను ఎవరితో చెప్పకూడదని అనుకున్నానని ఆష్లే తెలిపారు. 



 ఈ ప్రెగ్నెన్సీ గురించి ఎప్పటికీ రహస్యంగా ఉంచాలని తనను కోరారని చెప్పింది. అయితే  మస్క్ తండ్రి అని నిరూపించే ఏదైనా రుజువును ఇవ్వాలని మీడియా అడిగితే ఆష్లే తిరస్కరిస్తున్నారు.  మస్క్ తనకు విలాసవంతమైన అపార్ట్‌మెంట్ , అలాగే జీవనానికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేశాడని ఆష్లే చెబుతున్నారు.  ఒంటరిగా ఉన్నప్పటికీ తన బిడ్డను రక్షించుకోవడానికి తాను నిశ్శబ్దంగా ఉంటానని ఆష్లే చెబుతున్నారు.  సెయింట్ క్లెయిర్ శిశువు పేరును రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఆష్లే సెయింట్ క్లెయిర్ చేసిన ప్రకటనలపై ఎలాన్ మస్క్ ఇంత వరకూ స్పందించలేదు.       

మరో  కథనం: భారత్‌లో ఉద్యోగాలకు ‘టెస్లా’ ప్రకటన – మోదీ చేసిన ‘మ్యాజిక్‌’ ఇది  

మరిన్ని చూడండి

Source link