Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా మహాకుంభమేళాలో పవిత్రస్నానం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కు వెళ్లిన పవన్ కల్యాణ్ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. గంగమ్మతల్లికి పూజలు చేసి, హారతులిచ్చారు. పవన్ కల్యాణ్ తో పాటు ఆయన సతీమణి అన్నా లెజ్‌నేవా, కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్ ఉన్నారు.