Janhvi on signing spree in TollyWood టాలీవుడ్ స్టార్ హీరోతో జాన్వీ కపూర్


Tue 18th Feb 2025 09:33 PM

janhvi kapoor  టాలీవుడ్ స్టార్ హీరోతో జాన్వీ కపూర్


Janhvi on signing spree in TollyWood టాలీవుడ్ స్టార్ హీరోతో జాన్వీ కపూర్

బాలీవుడ్ గ్లామర్ గర్ల్ జాన్వీ కపూర్ మెల్లగా టాలీవుడ్ లో పాగా వేసేందుకు రెడీ అవుతుంది. నిన్నమొన్నటివరకు సౌత్ సినిమాల్లో నటించేందుకు ఆలోచించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ లో జెండా పాతేందుకు సిద్ధమైంది. ఇప్పటికే దేవర చిత్రంతో సౌత్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడమే కాదు.. ఆ వెంటనే RC 16 లో రామ్ చరణ్ సరసన ఆఫర్ పట్టేసింది. 

ప్రస్తుతం బుచ్చిబాబు-రామ్ చరణ్ కలయికలో నటిస్తున్న జాన్వీ కపూర్ మరో తెలుగు పాన్ ఇండియా స్టార్ హీరో చిత్రంలో అవకాశం అందిపుచ్చుకుంది అనే వార్త వైరల్ గా మారింది. అది పుష్ప 2 తో పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తో జాన్వీ కపూర్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

అల్లు అర్జున్-కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కలయికలో త్వరలోనే మొదలు కాబోయే చిత్రంలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా అనుకుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి సౌత్ లో అమ్మడు బ్యాక్ టు బ్యాక్ స్టార్స్ కాదు గ్లోబల్ స్టార్స్ తో జోడి కట్టడం అనేది మాములు విషయం కాదు. 


Janhvi on signing spree in TollyWood:

Janhvi Kapoor to romance Allu Arjun in her next





Source link