మెదక్ లో దారుణం, వివాహేతర సంబంధం కొనసాగించడంలేదని ప్రాణం తీశాడు-medak crime man takes woman life after extra marital relationship ends ,తెలంగాణ న్యూస్

మహిళ కొడుకులకు విషయం తెలియడంతో

అయితే ఈ విషయం, కొడుకులకు తెలియటంతో మహిళను తీవ్రంగా హెచ్చరించారు. తన కొడుకులకు భయపడి, గత కొంత కాలంగా ఏసును దూరం పెడుతూ వచ్చింది. మహిళ తనను దూరం పెడుతూ రావటంతో, ఆమెపై తీవ్ర కక్ష పెట్టుకున్న ఏసు ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. కలిసి మద్యం తాగుదామనే నెపంతో, మహిళను చిన్న శంకరంపేట్ మండలంలోని కొండాపూర్ గ్రామం దగ్గర్లోని అటవీ ప్రాంతానికి ఈ నెల 8న తీసుకెళ్లాడు. మద్యం తాగిన తర్వాత తనతో అదే విషయంపైన తీవ్ర వాగ్వివాదానికి దిగాడు. ముందుగానే తనతో తెచ్చుకున్న కత్తితో మహిళను పొడిచి చంపాడు. చంపినా తర్వాత, మృతదేహన్ని పెట్రోల్ పోసి నిప్పటించాడు.

Source link