టీ కప్పులో తుపాన్…! సిరిసిల్లలో ‘కేటీఆర్ టీ స్టాల్’పై వివాదం-tea stall shut down controversy over ktr photo displaying in sircilla ,తెలంగాణ న్యూస్

ఫోటో పేరు లేకుండా టీ స్టాల్ ఓపెన్…

కేటీఆర్ టీ స్టాల్ రాజకీయంగా దుమారం లేపడంతో టీ స్టాల్ నిర్వాహకుడు శ్రీనివాస్ చివరకు కేటీఆర్ ఫోటో పేరు తొలగించాడు. బంద్ అయిన టీ స్టాల్ ను ఓపెన్ చేశాడు. కేటీఆర్ పై ఉన్న అభిమానంతో ‘కేటీఆర్ టీ స్టాల్’ అని పెట్టుకున్నానని… టీ స్టాల్ లేకుంటే తనకు బతుకుదెరువు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకుదెరువు కోసం పేరు లేకుండా టీ స్టాల్ నడుపుతానని, కేటీఆర్ పై ఉన్న అభిమానాన్ని గుండెల్లో దాచుకుంటానని శ్రీనివాస్ తెలిపారు. మొత్తంగా టీ కప్పులో తుఫానులా కేటీఆర్ టీ స్టాల్ వివాదం మారింది.

Source link