మరింత భీకరంగా బ్యాటింగ్ లైనప్
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్‍కు తోడు ఐపీఎల్ 2025 సీజన్ కోసం హైదరాబాద్ జట్టులోకి ఇషాన్ కిషన్ వచ్చేశాడు. తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా మంచి ఫామ్‍లో ఉన్నాడు. మొత్తంగా ఈ సీజన్‍లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలో హైదరాబాద్ బ్యాటింగ్ దళం మరింత బలంగా ఉంది. గతేడాదే హిట్టింగ్‍తో ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించింది సన్‍రైజర్స్. ఈసారి బ్యాటింగ్ మరింత బలోపేతం కావడం, ఆటగాళ్లు మంచి ఫామ్‍లో ఉండటంతో ఏ రేంజ్‍లో చెలరేగుతారోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కమిన్స్, మహమ్మద్ షమీ, ఉనాద్కత్, ఆజం జంపాతో బౌలింగ్‍లోనూ ఈసారి పటిష్టంగా ఉంది హైదరాబాద్.