Hat-trick hits – Will Charan give me a chance హ్యాట్రిక్ హిట్లు-చరణ్ తో అవకాశం ఇప్పించేనా


Wed 19th Feb 2025 07:20 PM

ram charan  హ్యాట్రిక్ హిట్లు-చరణ్ తో అవకాశం ఇప్పించేనా


Hat-trick hits – Will Charan give me a chance హ్యాట్రిక్ హిట్లు-చరణ్ తో అవకాశం ఇప్పించేనా

టాలీవుడ్ కుర్ర హీరోలతో నటించిన రష్మిక కు అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 1, పుష్ప 2 లో అవకాశం వచ్చింది. అది ఆమెకు బ్రేక్ ఇచ్చింది అనే చెప్పాలి.  పుష్ప 2 పూర్తయ్యేలోపే రష్మిక మందన్న బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లోకి వెళ్ళిపోయింది. క్రేజీ స్టార్ హీరోలతో జత కట్టింది. అయినప్పటికి టాలీవుడ్ స్టార్ హీరోలెవరు రశ్మికకు అవకాశాలు ఇవ్వలేదు. 

ఇప్పుడు వరసగా మూడు హిట్లు, హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో ఉన్న రష్మిక వంక గ్లోబల్ స్టార్స్ కన్నేమైనా పడుతుందా, యానిమల్, పుష్ప ద రూల్, చావా చిత్రాలతో బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ హీరోయిన్ గా మారిన రష్మిక ను సుకుమార్-రామ్ చరణ్ చిత్రంలో హీరోయిన్ గా కన్సిడర్ చేస్తారా అంటూ మట్లాడుకుంటున్నారు. సుకుమార్ వరసగా మూడో ప్రాజెక్ట్ లోను రశ్మికతో వర్క్ చేస్తారా.. అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.  

రామ్ చరణ్ కి రష్మిక జోడి అయితే కొత్తగా ఉంటుంది, ఫ్రెష్ పెయిర్ గా ఉంటుంది అని సుకుమార్ ఆలోచిస్తే రశ్మికకు లక్కీ ఛాన్స్ వచ్చినట్టే, అటు చరణ్ కూడా హ్యాట్రిక్ హిట్స్ ఉన్న హీరోయిన్ తో రొమాన్స్ చెయ్యడం ప్లస్ అవుతుంది. ఇక RC 17 లో చరణ్-రష్మిక జోడి కలిసి జోడి కడితే ఆ క్రేజే వేరు అనేది మెగా ఫ్యాన్స్ అభిప్రాయం. చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అనేది. 


Hat-trick hits – Will Charan give me a chance:

Will Ram Charan romance Rashmika Mandanna





Source link