Who is Rekha Gupta Delhi New CM Profile Age Family Political Career Delhi Chief Minister | Delhi New CM: మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం

Rekha Gupta Delhi New CM: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేఖా గుప్తా కాలేజీ రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. రేఖా గుప్తా 1974లో హర్యానాలోని జింద్ జిల్లాలో పుట్టారుజన్మించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో  రేఖా గుప్తా తండ్రి పని చేసేవారు.  1976లో  రేఖా గుప్తా కుటుంబం ఢిల్లీకి మారింది. రేఖా గుప్తా మొదటి నుంచి నాయకత్వ లక్షణాలను చూపారు. విద్యార్థి దశలోనే రాజకీయాలు చేశారు.  విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో చురుకైన పాత్ర పోషించారు. విద్యార్థి దశలో దిల్లీ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ఆమె రెండుసార్లు ఎన్నికయ్యారు. రేఖా గుప్తా ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. 
 
తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీ తరపున మొదటి సారిగా  పితంపుర కౌన్సిలర్‌గా, షాలిమార్ బాగ్-బి నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఢిల్లీకి మేయర్ గా కూడా పని చేశారు. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ.. ఆమ్ ఆద్మీ పార్టీ గాలిలో ఓడిపోయారు. రెండు సార్లు ఆప్ ఆభ్యర్థి  బందనాకుమారి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే మూడో సారి అదే నియోజకవర్గం నుంచి బందనాకుమారిని 29వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించి .. ఘన విజయం అందుకున్నారు.   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  

ఢిల్లీలో నాలుగో మహిళా సీఎం రేఖా గుప్తా. గుతంలో సుష్మాస్వరాజ్, షీలాదీక్షిత్,  అతీషీ ముఖ్యమంత్రులుగా పని చేశారు. ఇప్పుడు నాలుగో సీఎం రేఖా గుప్తా.  సుష్మాస్వరాజ్ కుమార్తె  రేఖా గుప్తాను అభినందించారు. 



సీఎం పదవి కోసం.. కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేశ్ వర్మ తో పాటు మరికొంత మంది పోటీ పడ్డారు. అయితే మహిళకే ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ భావించడంతో రేఖా గుప్తాకు అవకాశం దక్కినట్లుగా తెలుస్తోంది.  రేఖా గుప్తా నియామకంతో కుటుంబసభ్యులు సంబరాలు జరుపుకున్నారు. 



 

మరిన్ని చూడండి

Source link