Bitcoins HardDrive: సౌత్ వేల్స్ లోని న్యూ పోర్టుకు చెందిన జేమ్స్ హావెల్స్ పన్నెండేళ్లుగా ఒకటే పనిమీద ఉన్నాయి. అక్కడ ఉన్న డంపింగ్ యార్డుల్లో అదే పనిగా సెర్చ్ చేస్తున్నాడు. ఇందుకోసం చాలా ఖర్చు పెట్టుకున్నాడు.పెన్నెండేళ్లుగా అతను చేస్తున్న పనిపై కొంత మంది కోర్టుకెళ్లి ఆపివేయించారు. చివరికి అతను ఇప్పుడు చెత్తలో వెదికే పనిని ఆపేశాడు. ఇంతకూ అతను పన్నెండేళ్లుగా ఏమి వెదుకుతున్నాడో తెలుసా.. ఆరున్నర వేల కోట్ల్ రూపాయల సంపదను. అది కూడా చిన్న హార్డ్ డ్రైవ్ లో ఉంది. అదేమి పాస్ వర్డ్ కాదు.. బిట్ కాయిన్.
జేమ్స్ హావెల్స్ బిట్ కాయిన్ స్పెషలిస్ట్. మొదట్లోనే ఆయన బిట్ కాయిన్ మైనింగ్ లో పండిపోయాడు. అలా అతను 2013లో తాను బిట్ కాయిన్లను సంపాదించి వాటిని హార్డ్ డిస్క్ లో భద్రపరుచుకున్నాడు. యాక్సెస్ కోడ్ లన్నీ ఆ హార్డ్ డిస్క్ లోనే ఉన్నాయి. అయితే ఓ సారి తన కార్యాలయాన్ని క్లీన్ చేసుకుంటూ.. ఈ వేస్ట్ అంటూ తన హార్డ్ డ్రైవ్ ను కూడా పడేశాడు. ఆ డ్రైవ్ ను చెత్తబండి వచ్చి తీసుకెళ్లిపోయింది. ఆ తర్వాత కాసేపటికి తన బిట్ కాయిన్లన్నీ అందులో ఉన్నాయని అర్థమైంది. ముందుగా తన చెత్త తీసుకుళ్లిన బండిని వెదుక్కుంటూ వెళ్లాడు.కానీ అప్పటికే ఆలస్యమపోయింది. చెత్తను ఆ బండి డంపింగ్ యార్డులో పడేసింది.
అప్పట్లో బిట్ కాయిన్ కు ఇంత విలువలేదు. కానీ దానికి అద్భిుతమైన భవిష్యత్ ఉంటుందని మాత్రం ఊహించాడు. అందుకే చెత్తలో వెదకడం ప్రారంభించాడు. అది అలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు ఇక ఆపేద్దాం అనుకున్నప్పుడు బిట్ కాయిన్ విలువ అతన్ని ఆశ పెట్టేది.మరికొంత కాలం వెదుకుదాం అని ముందుకు వెళ్లేవాడు. చెత్తను జల్లెడ పట్టడానికి AI- శక్తితో పనిచేసే డ్రోన్‌లు, రోబోటిక్ శోధన టీములు, చెత్త ను జాగ్రత్తగా జల్లెడ పట్టే నిపుణులైన ఇంజనీర్లను నియమించుకుని వెదికాడు. UK వ్యర్థాల నిర్వహణ చట్టాల ప్రకారం అతనికి దక్కలేదు. న్యాయపోరాటం చేసినా.. 2024లో, బ్రిటిష్ న్యాయమూర్తి హోవెల్స్ కేసుకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో, డ్రైవ్‌ను తిరిగి పొందే అవకాశం ఇక లేదని తేలిపోయిదంి.
మొదట్లో హోవెల్స్‌కు యాక్సెస్ మంజూరు చేయబడినప్పటికీ డ్రైవ్ ఉపయోగపడే స్థితిలో ఉండే అవకాశం లేదని దశాబ్దానికి పైగా తేమ, పీడనం, తీవ్రమైన ఉష్ణోగ్రతలకు గురికావడం వల్ల డేటా పాడైపోయి ఉండవచ్చు లేదా నాశనం అయి ఉండవచ్చునని కోర్టు అభిప్రాయపడింది. హోవెల్స్ చేసన తప్పు ఇప్పుడు అనేక మంది మేలుకొలుపుగా మారింది. సాంప్రదాయ బ్యాంకింగ్ అయితే కోల్పోయిన పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయవచ్చు లేదా ఖాతాలను తిరిగి పొందవచ్చు, బిట్‌కాయిన్ లో ఈ రెండు అవకాశాలు ఉండవు. ప్రైవేటు కీ .. మర్చిపోతే మొత్తం సంపద హరించుకుపోయినట్లే.
Also Read: ఆకాశం నుంచి ఊడిపడబోతున్నసిటీ కిల్లర్ – ఓ నగరం మొత్తం భూస్థాపితం ఖాయం – ఇంతకీ ఏమిటో తెలుసా ?
మరిన్ని చూడండి