RRB Recruitment 2025 Application Deadline Extended 32438 Vacancies How To Apply

Railway jobs Application Date Extended: రైల్వే శాఖలో పలు విభాగాల్లో 32 వేల లెవల్-1 (గ్రూప్-డి) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పొడిగించింది. జనవరి 23న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 22తో గడువు ముగియనుంది. అయితే దరఖాస్తు గడువును మార్చి 1 వరకు పొడిగించింది. అభ్యర్థులు మార్చి 3 వరకు దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు. రైల్వేశాఖ భర్తీచేసే ఖాళీల్లో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్‌ టీఆర్‌డీ, అసిస్టెంట్‌ టీఎల్‌ అండ్ ఏసీ పోస్టులు ఉన్నాయి. 

దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు మార్చి 4 నుంచి 13 మధ్య వివరాలు ఎడిట్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీపీ కేటగిరీ అభ్యర్థులు రూ.500; ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. రైల్వేశాఖ పరిధిలో అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్ జోన్లు ఉన్నాయి.

ఖాళీల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

విద్యార్హత ప్రమాణాల సడలింపు..
రైల్వే ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతల విషయంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు అవసరమైన కనీస విద్యార్హత ప్రమాణాలను సడలించింది. కొత్త ప్రమాణాల ప్రకారం.. పదోతరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) జారీ చేసిన నేషనల్ అప్రెంటిష్‌షిప్ సర్టిఫికెట్ (NAC) కలిగిన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చే. కాగా, ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో టెక్నికల్ విభాగాల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీస విద్యార్హత పదోతరగతితో పాటు ఎన్ఏసీ సర్టిఫికెట్ లేదా ఐటీఐ డిప్లొమా కలిగి ఉన్న వారిని మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. తాజాగా, ఈ విద్యార్హత ప్రమాణాలను సడలించింది. రైల్వే శాఖలోని పలు విభాగాల్లో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్ సహా దాదాపు 32 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వయోపరిమితి: ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ పోస్టుల భర్తీకి 07.01.2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దివ్యాంగ అభ్యర్థులకు వయోసడలింపు కల్పించారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్షతో పాటు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీపీ కేటగిరీ అభ్యర్థులు రూ.500; ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. 

ప్రారంభ వేతనం: నెలకు రూ.18 వేలు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలివే..

➥ నోటిఫికేషన్ విడుదల తేదీ: 28.12.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 23.01.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.02.2025. (01.03.2025 వరకు పొడిగించారు.)

Notification

Online Application

Website

 

RRB Recruitment 2025: ఇండియన్ రైల్వేలో 32 వేల ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశమంటే?

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి

Source link