ఒంటరిగా ఉండడానికి భయమేస్తుంది-సమంత

 

సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె మూడు రోజుల పాటు ఫోన్‌ను పూర్తిగా దూరంగా పెట్టిన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు.

సమంత తరచుగా తన జీవితానికి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటారు. ప్రయాణాలు, సినిమా ప్రాజెక్టులు, వ్యక్తిగత అనుభవాలు.. ఇలా ప్రతీదీ ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు. అయితే ఇటీవల మూడు రోజుల పాటు ఫోన్‌ను పూర్తిగా పక్కన పెట్టి మౌనంగా గడిపిన అనుభవాన్ని వివరిస్తూ ఆమె చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

మూడు రోజులు పూర్తిగా మౌనంగా గడిపాను. ఎవరితోనూ మాట్లాడలేదు ఫోన్‌కి కూడా దూరంగా ఉన్నాను. మనం ఒంటరిగా గడిపే సమయం చాలా గట్టిదే కొంతమందికి భయంకరంగానూ అనిపించొచ్చు. కానీ ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన అనుభవం. ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఇలా ఒంటరిగా ఉండాలని అనుకున్నాను. మీరు కూడా ప్రయత్నించండి అంటూ అభిమానులకు సూచించారు.

సమంత ప్రస్తుతం తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వివిధ చికిత్సలు తీసుకుంటూ తన శారీరకంగా, మానసికంగా బలంగా మారేందుకు కృషి చేస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే ఇటీవల మహిళా ప్రాధాన్య కథలతో ప్రేక్షకులను మెప్పించిన సమంత వెబ్‌సిరీస్ ప్రాజెక్టులతోనూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆమె వరుణ్ ధావన్ కలిసి నటించిన సిటడెల్ హనీ బన్నీ వెబ్‌సిరీస్‌ ఇటీవల ఐకానిక్ గోల్డ్ అవార్డు గెలుచుకుంది. ఉత్తమ వెబ్‌సిరీస్‌గా ఎంపికైంది.

ప్రస్తుతం సమంత రక్త బ్రహ్మాండ అనే భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. దీనికి ది బ్లడీ కింగ్‌డమ్ ఉపశీర్షికగా ఉంది. ఈ చిత్రాన్ని తుంబాడ్ ఫేమ్ రాహి అనిల్ బార్వే తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయినట్లు సమంత తెలిపారు. మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వచ్చేశా అంటూ పోస్ట్ షేర్ చేశారు. ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Source link