కాగా రాజ లింగమూర్తి హత్య విషయమై ఆయన భార్య సరళ స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేసింది. భూపాలపల్లి టౌన్ లోని పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న భూమి విషయంలో రేణికుంట్ల కొమురయ్య, రేణికుంట్ల సంజీవ్ కుటుంబ సభ్యులతో తమకు కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. రేణికుంట్ల సంజీవ్, పింగళి శ్రీమంత్, మోరె కుమార్, కొత్తూరి కుమార్ అనే నలుగురు బుధవారం రాత్రి బైక్ పై వచ్చి రాజలింగమూర్తిని రోడ్డుపైనే కత్తులతో పొడిచి చంపేశారని, దీని వెనుక కొందరు పొలిటికల్ లీడర్ల హస్తం ఉందని కూడా ఆరోపించింది. కాగా సరళ ఫిర్యాదు మేరకు భూపాలపల్లి స్టేషన్ లో బీఎన్ఎస్ సెక్షన్ లు 191(2), 191(3), 61(2), 126(2), 103(2) రెడ విత్ 190 సెక్షన్లతో 117/2025 నంబర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.