ideas of india 2025 4th editon in mumbai abp network chief editor atideb sarkar speech text and video here

Ideas Of India 2025: ముంబైలో ABP నెట్‌వర్క్ వార్షిక ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ శుక్రవారం ప్రారంభమైంది. ప్రముఖ గాయని, స్వరకర్త సంజీవని భేలాండే చేసిన సరస్వతి వందనంతో కార్యక్రమం స్టార్ట్ అయింది. అనంతరం ABP నెట్‌వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్ స్వాగత ప్రసంగం చేశారు. రెండు రోజులపాటు జరిగే శిఖరాగ్ర సమావేశానికి మంచి ఉత్సాహాన్ని అందించారు.  

ఆయన పూర్తి ప్రసంగం ఇదే :

“లేడీస్ అండ్ జెంటిల్మెన్,

ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025కి స్వాగతం.

కొత్త అవకాశాలు మనల్ని ఆహ్వానిస్తున్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిలియన్ల మంది నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. వ్యాధి తీవ్రతను డేటా మైనింగ్ అంచనా వేసి సమస్యలను పరిష్కరించగలదు(solve ). రెండో తరం అంతరిక్ష పోటీ(second Space Race) జరుగుతోంది; అందులో భారత్ కూడా భాగమై ఉంది. మరణమే లేకుండా జీవించే అవకాశాల(the possibility)పై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. 

మనల్ని వెనక్కి నెట్టేది ఏమిటి?

మనమే.

మానవ జాతికి AI ముప్పుగా భావిస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇది మానవజాతి అంతరించిపోయేలా(redundant, or worse, extinct) చేస్తుందని భయపడుతున్నారు. రాజకీయ, విదేశీ శక్తులు మన డేటా(mining our online data)ను తీసుకొని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భూమిపై జరుగుతున్న రాజకీయ గందరగోళానికి అంతరిక్షంలో కూడా ప్రకంపనలు(reflecting) వస్తున్నాయి. వృద్ధ జనాభాకు మద్దతు(support )గా నిలవడం కోసం చాలా ఆర్థిక వ్యవస్థలు కష్టపడుతున్నాయి.

పెద్ద ప్రశ్నలు ఉన్న చోటే కొన్ని సమాధానాలు ఉంటాయి.

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా AIని నియంత్రించాలి(regulated). తప్పుడు సమాచారం మూలాలను గుర్తించడానికి పౌరులు డేటా మైనింగ్ సాధనాలుగా ఉపయోగించాలి(should use). భూమి, అంతరిక్షం ఎక్కడైనా ప్రాథమిక సూత్రాలు(Ground rules) అమలు చేయాలి. వయసు పెరిగే కొద్దీ ప్రజలు తమ వర్కింగ్ లైవ్స్‌(extend their working lives )ను మార్చుకోవాలి. ఆఫీస్‌లు కూాడా మరింత సరళంగా మారాలి.

మనకు పటిష్ట నాయకత్వం, సహకారం అంతకు మించి కొంచెం కామన్‌ సెన్స్‌ అవసరం.

మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి.

అది మనల్ని తదుపరి సరిహద్దుకు తీసుకెళుతుంది.

ధన్యవాదాలు.”

ఆయన మాట్లాడిన ఇంగ్లిష్‌ స్పీచ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి   

2047లో భారతదేశం తన స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలను సమీపిస్తున్న తరుణంలో ఏబీబీ నెట్‌వర్క్‌ ప్రతి ఏడాది ఈ శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తూ వస్తోంది. దేశం అసాధారణ పురోగతిని ఉజ్వల భవిష్యత్తు సామర్థ్యాన్ని మరింతగా హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తుంది.

“Humanity’s Next Frontier” అనే ఇతివృత్తంతో నాల్గో ఎడిషన్‌ను ఏబీపీ నిర్వహిస్తోంది. ప్రపంచ వేదికపై వ్యాప్తి చెందుతున్న భారతదేశం ప్రాభవాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మంచి ఆలోచనలు కలిగిన నాయకులు, ఆవిష్కర్తలు, మార్పును తీసుకురాగలిగే వారిని ఒకే వేదికపైకి తీసుకొస్తోంది ఈ శిఖరాగ్ర సమావేశం. ఇక్కడ జరిగే చర్చలు కొత్త ఆలోచనలకు నాంది పలుకుతాయి. మరిన్ని సరికొత్త నిర్ణయాలకు శ్రీకారం చుడతాయి. డైనమిక్ భవిష్యత్తుకు మార్గం వేస్తాయి. ఇదే ఐడియాస్ ఆఫ్ ఇండియా లక్ష్యం. 

ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ నాల్గో ఎడిషన్‌ను ప్రత్యక్ష ప్రసారం ఇక్కడ చూడండి:

మరిన్ని చూడండి

Source link