కొత్త రేషన్ కార్డుల జారీకి మీసేవా కేంద్రాల నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా… భారీ సంఖ్యలో ప్రజలు మీసేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు కాకుండా.. కొత్తగా వచ్చే వాళ్ల నుంచే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కొత్త కార్డు కోసంతో పాటు పాత కార్డుల మార్పులు, చేర్పుల కోసం కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు.