ఫైనల్లీ సంక్రాంతికి వస్తున్నాం రాక కన్ ఫర్మ్


Sat 22nd Feb 2025 03:35 PM

sankranthiki vasthunnam  ఫైనల్లీ సంక్రాంతికి వస్తున్నాం రాక కన్ ఫర్మ్


Sankranthiki Vasthunnam TV premiere date ఫైనల్లీ సంక్రాంతికి వస్తున్నాం రాక కన్ ఫర్మ్

ఇటీవల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన రీజనల్ ఇండస్ట్రీ హిట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం గురించి అందరికీ తెలిసిందే. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ సినిమా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు అందరి దృష్టి ఓటిటి విడుదలపై ఉన్నప్పటికీ జీ సంస్థ ముందుగా ఈ సినిమా బుల్లితెర టెలికాస్ట్‌ డేట్‌ను ప్రకటించి అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.

జీ తెలుగు ఛానెల్ వారు ఈ చిత్రాన్ని త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా విడుదలైన సమాచారం ప్రకారం ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫైనల్‌గా టెలికాస్ట్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. మార్చి 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ఈ సినిమా ప్రసారం కానుందని వారు అధికారికంగా ప్రకటించారు.

థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ చిత్రం బుల్లితెరపై కూడా అదే స్థాయిలో సక్సెస్ సాధిస్తుందా టీఆర్పీ రేటింగ్స్‌లో కొత్త రికార్డులను నమోదు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ హిట్ మూవీని మరోసారి ఆస్వాదించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Sankranthiki Vasthunnam TV premiere date:

Sankranthiki Vasthunnam OT date locked





Source link